65 బస్తాల రేషన్‌ బియ్యం పట్టివేత

ABN , First Publish Date - 2021-07-25T05:12:15+05:30 IST

అక్రమంగా త రలిస్తున్న 65 బస్తాల రేషన్‌ బియ్యా న్ని పోలీసులు శనివారం పట్టుకున్నా రు.

65 బస్తాల రేషన్‌ బియ్యం పట్టివేత

ఇద్దరు అరెస్టు.. వాహనం స్వాధీనం 

అద్దంకి, జూలై 24: అక్రమంగా త రలిస్తున్న 65 బస్తాల రేషన్‌ బియ్యా న్ని పోలీసులు శనివారం పట్టుకున్నా రు. వాహనాన్ని స్వాధీనం చేసుకోవ డంతోపాటు, ఇద్దరు వ్యక్తులను అ రెస్టు చేశారు. అద్దంకి-2వ సెక్టార్‌ ఎ స్సై లక్ష్మీభవాని కథనం మేరకు.. శని వారం వేకువజామున 3 గంటల సమయంలో ఆమెతోపాటు, సిబ్బంది పట్టణం లో గస్తీ తిరుగుతున్నారు. అప్పుడు రేణింగవరం వైపు పట్టకప్పుకొని ఒక వాహ నం వెళ్తోంది.  అనుమానంతో దాన్ని నిలిపి పరిశీలించగా రేషన్‌ బియ్యం బస్తా లు ఉన్నాయి. అందులో ఉన్న వెంపరాలకు చెందిన భైరపునేని నరేష్‌, ఉమామ హేశ్వరరావును అదుపులోకి తీసుకొని విచారించగా గ్రామంలో రెండు రేషన్‌ షా పుల నుంచి అక్రమంగా తరలిస్తున్నట్లు తేలిందని లక్ష్మీభవాని చెప్పారు. దీంతో బియ్యంతోపాటు, వాహనాన్ని స్వాధీనం చేసుకొని ఇద్దరిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశామని ఆమె తెలిపారు. పట్టుబడిన రేషన్‌ బియ్యాన్ని సివిల్‌సప్లయీస్‌ అధికారులకు అప్పగిస్తామని చెప్పారు.

కుంకుపాడులోనూ..

మండలంలోని కుంకుపాడులో రేషన్‌ దుకాణాన్ని శింగరాయకొండ ఎన్‌ఫోర్సుమెంట్‌ డిప్యూటీ త హసీల్దార్‌  రాఘవేంద్ర భూపతి తనిఖీ చేశారు.  అక్కడ నిల్వ ఉండాల్సిన బియ్యం కంటే 36 బస్తాలు అదనంగా ఉన్నట్లు గుర్తించారు. డీలర్‌ రోశయ్య అదే గ్రామానికి చెందిన శ్రీనివాసరావుతో కలిసి కార్దుదారుల నుంచి కిలో రూ.10 చొప్పున రేషన్‌ బియ్యాన్ని కొనుగోలు చేసి నిల్వ ఉంచుతున్నట్తు నిర్ధారించుకున్నారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకొని శనివారం అద్దంకి పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - 2021-07-25T05:12:15+05:30 IST