ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ABN , First Publish Date - 2021-07-27T04:50:38+05:30 IST

ప్రజాసంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని పలువురు ప్రజాప్రతినిధులు అన్నారు. సోమవారం అధికారులతో కలిసి జిల్లా వ్యాప్తంగా రేషన్‌ కార్డులను పంపిణీ చేశారు

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
అశ్వారావుపేటలో ఆహారభద్రతాకార్డులు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు

ఆహారభద్రతా కార్డుల పంపిణీలో ప్రజాప్రతినిధులు

అధికారులతో కలిసి జిల్లావ్యాప్తంగా లబ్ధిదారులకు అందజేత

నెట్‌వర్క్‌: ప్రజాసంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని పలువురు ప్రజాప్రతినిధులు అన్నారు. సోమవారం అధికారులతో కలిసి జిల్లా వ్యాప్తంగా రేషన్‌ కార్డులను పంపిణీ చేశారు. కొత్తగూడెంలో కలెక్టర్‌ అనుదీప్‌, ఎమ్మెల్యే వనమాతో కలిసి రేషన్‌ కార్డులు పంపిణీ చేశారు. అశ్వారావుపేట, పినపాక, ఇల్లెందు, కొత్తగూడెం ఎమ్మెల్యేలు మెచ్చా నాగేశ్వరరావు, రేగా కాంతారావు, హరిప్రియ, వనమా వెంకటేశ్వరరావు ఆయా మండలాల్లో రేషన్‌ కార్డులు పంపిణీ చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

అన్నపురెడ్డిపల్లిలోని రైతు వేదికలో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు మొక్కను నాటి మండలవ్యాప్తంగా జారీ అయిన 189 నూతన రేషన్‌ కార్డులు, 14 కల్యాణలక్ష్మి చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేశారు. చండ్రుగొండ ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన ఆహరభద్రతా కార్డులు పంపిణీలో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పాల్గొని 486 మంది లబ్ధిదారులు కార్డులు, 11మంది కల్యా ణ లక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులు అందజేశారు. దమ్మపేట రెవెన్యూ కార్యాలయం వద్ద సోమవారం జరిగిన కార్యక్రమంలో రేషన్‌ కార్డులు, కల్యాణలక్ష్మి, షాదిముబారక్‌ చెక్కులు పంపిణీ చేశారు. అశ్వారావుపేటలోని గిరిజన భవన్‌లో సోమవారం ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన 922 ఆహారభద్రతా కార్డులను పంపిణీ చేశారు. అన్నపురెడ్డిపల్లిలో జరిగిన కార్యక్రమంలో సర్పంచ్‌ బోడా పద్మ, ఉప సర్పంచ్‌ పర్సా వెంకటేశ్వరరావు, తహసీల్దార్‌ భద్రకాళి, ఎంపీడీవో రేవతి, ఏవో అనూష, ఎస్‌ఐ తిరపతి, జడ్పీటీసీ లాలమ్మ, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు సుధాకర్‌రావు, మండలరైతుబంధు కో-ఆర్డినేటర్‌ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.చంద్రుగొండలో జరిగిన కార్యక్రమంలో ఎంపీపీ బోణోత్‌ పార్వతి, తహసీల్దార్‌ ఉషాశారద, ఎంపీడీవో అన్నపూర్ణ, టీ ఆర్‌ఎస్‌ పార్టీ మండలాధ్యక్షుడు భోజ్యా, ఎంపీటీసీ దారా బాబు, ఏడుకొండలు పాల్గొన్నారు. దమ్మపేటలో జరిగిన కార్యక్రమంలో తహసీల్దార్‌ రంగా ప్రసాద్‌, జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, ఎంపీపీ సోయం ప్రసాద్‌, వైస్‌ ఎంపీపీ మల్లికార్జునరావు, సొసైటీ చైర్మన్‌ రావు జోగేశ్వరరావు, ఆత్మాకమిటీ చైర్మన్‌, రాజేశ్వరరావు, కేవీ సత్యనారాయణ, ఏఎంసీ ఉపాధ్యాక్షుడు కొయ్యల అచ్యుతరావు, సర్పంచ్‌ చిన వెంకటేశ్వరరావు, ఉపసర్పంచ్‌ దారా యుగంధర్‌, రెడ్డిమళ్ల వెంకటేశ్వరరావు, పగడాల రాంబాబు, దొడ్డా రమేష్‌, వెంపాటి భరత్‌, బొల్లికొండ ప్రభాకర్‌, అబ్దుల్‌ జిన్నా, సుదర్శనరావు, బాబు పాలొన్నారు. అశ్వారావుపేటలో జరిగిన కార్యక్రమంలో ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి, జడ్పీటీసీ చిన్నంశెట్టి వరలక్ష్మీ, తహసీల్దారు చల్లా ప్రసాద్‌, డీటీ సుచిత్ర, ఆర్‌ఐ వెంకటేశ్వర్లు, సొసైటీ ఛైర్మన్‌ నూతక్కి నాగేశ్వరరావు, నిర్మల పుల్లారావు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షులు బండి పుల్లారావు, సర్పంచులు అట్టం రమ్య, నార్లపాటి సుమతి, దుర్గయ్య, కృష్ణవేణి, ఎంపీటీసీ మిండా హరిబాబు, వేముల భారతి, మారుతి లలిత, ఎస్‌.తిరుమలదేవి, సీఐ ఉపేందరరావు, వైస్‌ ఎంపీపీ ఫణీంద్ర, మాజీ ఎంపీపీ కాసాని వెంకటేశ్వరరావు, మండల కార్యదర్శి బండారు శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు, వీరభద్రరరావు, మోహనరెడ్డి, చంద్రమోహన్‌, సత్యనారాయణ, చందా లక్ష్మీనర్సయ్య, మురళి, బ్రహ్మేందరరా వు పాల్గొన్నారు.ములకలపల్లి రైతు వేదికలో సోమవారం ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు లబ్ధిదారులకు ఆహార భద్రత కార్డులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ నాగమణి, సర్పంచి భద్రం, తహసీల్దార్‌ వీరభద్రం, జడ్పీటీసీ నాగమణి, ఎంపీటీసీ మెహ్రా, సర్పంచ్‌లు సుధీర్‌, సుధాకర్‌, రాజేశ్‌, నాగరాజు ఉన్నారు. ఆళ్లపల్లిలో సోమవారం తహసీల్దార్‌ సాదీయాసుల్తాన్‌ అఽధ్యక్షతన రైతువేదికలో ఎమ్మెల్యే రేగా కాంతారావు 145 కొత్త రేష న్‌ కార్డులను లభ్ధిదారులకు అందజేశారు. అశ్వాపురం మండలంలో ఎమ్మెల్యే కాంతారావు 621 మంది లబ్ధిదారులకు రేషన్‌ కార్డులను పంపిణీ చేశారు.

ఆళ్లపల్లిలో జరిగిన కార్యక్రమంలో ఎంపీడీవో మంగమ్మ, జడ్పీటీసీ హనుమంతరావు, ఎంపీపీ మంజు భార్గవి, ఉ మ్మడి గుండాల మండల కో-ఆపరేటీవ్‌ చైర్మన్‌ రామయ్య, వైస్‌ ఎంపీపీ ఎల్లయ్య, కోఆపరేటివ్‌ డైరక్టర్‌ అఫీజ్‌, స ర్పం చ్‌లు కోటేశ్వరావు, శంకర్‌బాబు, నర్సింహరావు, నిర్మల, ప్రే మకళ, శ్రీదేవి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు నర్సింహ రా వు, బాబా, ఖయ్యూం, కిశోర్‌, అతహార్‌, ప్రవీణ్‌, సత్యం, భద్రం, రాంబాబు పాల్గొన్నారు. 

అశ్వాపురంలో జరిగిన కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్‌ తుళ్లూరి బ్రహ్మయ్య, ఎంపీపీ ముత్తినేని సుజాత, వైస్‌ ఎంపీపీ వీరభద్రం, జడ్పీ కో-ఆప్షన్‌ సభ్యుడు షర్పుద్ధీన్‌, మండల కో-ఆప్షన్‌ సభ్యుడు ఖదీర్‌, అశ్వాపురం, మొండికుంట సర్పంచ్‌లు బాణోత్‌ శారద, మర్రి మల్లారెడ్డి, రైతుసమన్వయసమితి కన్వీనర్‌ లక్ష్మారెడ్డి, తహసీల్దార్‌ సురేష్‌కుమార్‌, ఆర్‌ఐ తిరుపతిరావు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కోడి అమరేందర్‌ పాల్గొన్నారు.

ఇల్లెందులో సింగరేణి వైసీవోఏ క్లబ్‌లో 1,265 రేషన్‌ కార్డులను ఎమ్మెల్యే హరిప్రియ, అడిషనల్‌ కలెక్టర్‌ వెంకటే శ్వర్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంఽథాల యసంస్థ చైర్మన్‌ దిండిగాల రాజేందర్‌, మునిసిపల్‌ చైర్మన్‌ దమ్మాలపాటి వెంకటేశ్వర్‌రావు, వైస్‌చైర్మన్‌ జానీ, ఎంపీపీ చీమల నాగరత్నమ్మ, జడ్పీటీసీు వాంకుడోత్‌ ఉమాదేవి, డీ సీసీబీ డైరెక్టర్‌ జనగం కోటేశ్వర్‌రావు, రైతుసమన్వయ సమితి నాయకులు పులిగళ్ల మాధవరావు, తహసీల్దార్‌ కృష్ణవేణి, కమిషనర్‌ ఆళ్ల శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. 

కొత్తగూడెం నియోజకవర్గంలో 12,576 కొత్తరేషన్‌ కార్డులు, కొత్తగూడెం పురపాలకంలో 663 కార్డులను  కలెక్టర్‌ అను దీప్‌, ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పంపిణీ చేశారు.  కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌ప ర్సన్‌ సీతాలక్ష్మి, వైస్‌ చైర్మ న్‌ దామోదర్‌, జడ్పీ వైస్‌ చైర్మన్‌ కంచర్ల చంద్రశేఖర్‌రావు, ఆర్డీవో స్వర్ణలత, మునిసిపల్‌ కమిషనర్‌ సంపత్‌కుమార్‌, తహసీల్దార్‌ రామకృష్ణ పాల్గొన్నారు.

బూర్గంపాడులో ఎమ్మెల్యే కాంతారావు, ఆదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లుతో కలిసి లబ్ధిదారులకు 512 ఆహారభద్రతా కార్డులు పంపీణీ చేశారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫరా ల శాఖ డీటీ కస్తాల వెంకటేశ్వర్లు, జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, ఏఎంసీ చైర్‌పర్సన్‌ ముత్యాలమ్మ, సోసైటీ చైర్మన్‌ బిక్కసాని శ్రీనివాసరావు, తహసీల్దార్‌ భగవాన్‌రెడ్డి, ఎంపీ డీవో వివేక్‌రాం, సర్పంచులు, టీఆర్‌ఎస్‌ మండల ఆద్యక్షుడు రమణారెడ్డి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగదీష్‌, రామకొండారెడ్డి, వంశీకృష్ణ పాల్గొన్నారు.

గుండాల రైతు వేదికలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కాంతారావు లబ్ధిదారులకు ఎమ్మెల్యే కాంతారావు రేషన్‌ కార్డులు పంపిణీ చేశారు. అనంతరం అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయిన కొడవటంచకు చెందిన ఈసం బక్కయ్య కుటుంబానికి రేగవిష్ణు మొమోరియల్‌ చారిటబుల్‌ ట్రస్టు ఆద్వర్యంలో నిత్యావసర సరుకులు, దుప్పట్లు, బియ్యం పంపిణీ చేశారు.  ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముక్తి సత్యం, జడ్పీటీసీ వాగబోయిన రామక్క, ఎంపీటీసీ ఎస్కే సంధాని, సర్పంచ్‌ కొరం సీతారాములు, ఉప సర్పంచ్‌ మానాల ఉపేందర్‌, తహసీల్దార్‌ రంగు రమేష్‌, ఎంపీడీఓ హజరత్‌ ఆలీ, ఆర్‌ఐ నాగేశ్వరరావు పాల్గొన్నారు.

జూలూరుపాడు మండలంలో 419 మంది లబ్ధిదారులకు వైరా ఎమ్మెల్యే రాములు నాయక్‌ కార్డులు పంపిణీ చేశారు. 28 మందికి కళ్యాణలక్ష్మీ చెక్కులను అందించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ లూదర్‌ విల్సన్‌, ఎంపీడీవో చంద్రశేఖర్‌, సొసైటీ చైర్మన్‌ లేళ్ళ వెంకటరెడ్డి, ఎంపీపీ లావుడ్యా సోనీ, జడ్పీటీసీ కళావతి, సర్పంచ్‌లు గలిగె సావిత్రి, బాణోత్‌ నరసింహారావు, ఎంపీటీసీలు రాజశేఖర్‌, మధుసుధన్‌రావు, బాణోత్‌ నీల, తదితరులు పాల్గొన్నారు. 

దుమ్ముగూడెం మండలపరిషత్‌  సమావేశమందిరంలో సోమవారం కొత్త రేషను కార్డులను లబ్ధిదారులకు ఎంపీపీ రేసు లక్ష్మి అందజేశారు. మండలానికి మొత్తంగా 1093 నూతన ఆహారభద్రతా కార్డులు మంజూరయ్యాయి. కార్యక్ర మంలో తహసీల్దార్‌ రవికుమార్‌, ఎంపీడీ వో చంద్రమౌళి, ఎంపీవో ముత్యాలరావు తదితరులు పాల్గొన్నారు. 

పాల్వంచ మండలంలో సోమవారం పాత ఆర్డీవో కార్యాలయ సమావేశ మందిరంలో 384 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు నూతన రేషన్‌ కార్డులను ఆందజేశారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ స్వామి, ఆర్‌ఐ రామయ్య, డీసీఎంఎస్‌ వైస్‌ చైర్మన్‌ కొత్వాల శ్రీనివా సరావు, సొసైటీ వైస్‌ చైర్మన్‌ కాంపెల్లి కనకేష్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు వనమా రాఘవేంద్రరావు, మునిసిపల్‌ కమిష నర్‌ చింతా శ్రీకాంత్‌, ఎంపీడీవో రవీంద్ర ప్రసాద్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-07-27T04:50:38+05:30 IST