సమావేశంలో మాట్లాడుతున్న తహసీల్దార్
దేవరాపల్లి, జనవరి 23: వచ్చే నెల 1వ తేదీ నుంచి పేదల ఇంటి వద్దకే నిత్యావసర సరుకులు పంపిణీని అత్యంత పారదర్శకంగా చేపట్టాలని తహసీల్దార్ రమేశ్‌బాబు అన్నారు. శనివారం ఆయన వీఆర్వోలు, రేషన్ డీలర్లు, మొబైల్ వ్యాన్ ఆపరేటర్లతో ద్రోణంరాజు ఆడిటోరియంలో సమావేశమయ్యారు. మండలంలో 31 రేషన్ డిపోల్లో 19 వేల రేషన్ కార్డులు ఉన్నాయన్నారు. ఒకటో తేదీ నుంచి 18వ తేదీలోగా ఉదయం 6 నుంచి సాయంత్రం 7 గంటల వరకు రోజుకు 90 కుటుంబాలకు సరుకులు పంపిణీ చేయాలన్నారు.