నిరీక్షణకు తెర

ABN , First Publish Date - 2021-07-26T04:58:15+05:30 IST

నిరీక్షణకు తెర

నిరీక్షణకు తెర
రేషన్‌కార్డులపై విచారణ నిర్వహిస్తున్న రెవెన్యూ సిబ్బంది (ఫైల్‌)

కొత్త రేషన్‌కార్డులకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌

ఖమ్మం జిల్లాలో 12,111, భద్రాద్రి జిల్లాలో 12,574 కార్డులు మంజూరు

నేటినుంచి పంపిణీకి యంత్రాంగం సమాయత్తం

ఖమ్మం కలెక్టరేట్‌/కొత్తగూడెం కలెక్టరేట్‌, జూలై 25: రేషన్‌కార్డుల కోసం రెండు, మూడేళ్లుగా ఎదురుచూస్తున్న ఉమ్మడి జిల్లా వాసుల ఆశలు ఎట్టకేలకు నెరవేరబోతున్నాయి. ఇన్నాళ్లుగా దరఖాస్తు చేసుకుని చేస్తున్న నిరీక్షణకు తుదిరూపం వచ్చింది. కొత్తరేషన్‌కార్డులు మంజూరు చేయాలని ఇటీవల ప్రభుత్వం నిర్ణయించగా.. ఆమేరకు అధికారులు దరఖాస్తులను క్షేత్రస్థాయి పరిశీలించారు. కుటుంబాల్లో కొత్తగా కాపురం పెట్టిన వారు, గతంలో కుటుంబాల నుంచి తొలగించిన వారు, కార్డుల కోసం మీసేవల్లో దరఖాస్తు చేసుకుని నిరీక్షించారు. అవన్నీ దాదాపు ఖమ్మం జిల్లాలో 40,144దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా... 12,111 కార్డులకు గ్రీన్‌సిగ్నల్‌ వచ్చింది. విచారణ జరిపిన అనంతరం 16,899కార్డుల దరఖాస్తులను రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ లాగిన్‌కు పంపగా.. వాటిలో 16,089 కార్డులు అర్హత సాధించాయి. ఇక నిబంధనల ప్రకారం 12,111 కార్డులు మాత్రమే అర్హత సాధించగా.. మొత్తంగా 4788కార్డులను (దరఖాస్తులను) తిరస్కరణకు గురాయ్యాయి. 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం 55,608 మంది కొత్త రేషన్‌కార్డులు, పేరు మార్పిడి, తదితర సవరణల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వాటిలో 15,953 దరఖాస్తులను కమిషనర్‌ లాగిన్‌కు పంపగా.. 12,574 కార్డులకు అనుమతి వచ్చింది. 

ఖాళీల వివరాలు అందించాం, రాజేంద్రప్రసాద్‌, ఖమ్మం డీఎస్వో 

జిల్లాలో మండలాల వారీగా రేషన్‌ డీలర్ల ఖాళీలను సేకరించాం. మొత్తం 669 దుకాణాలకు గాను ఖమ్మం డివిజన్‌లో 61, కల్లూరు డివిజన్‌లో 27 ఖాళీలు ఉన్నాయి. వీటి వివరాలను ప్రభుత్వానికి నివేధించాం. జిల్లాలో కొత్త రేషన్‌కార్డులు 12,111 మంజూరయ్యాయి. వ3వేల వరకు తిరస్కరించారు. ఇంకా 500 వరకు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని త్వరలో మంజూరు చేస్తాం. 

ఖమ్మం జిల్లాలో రేషన్‌డీలర్ల భర్తీకి ప్రతిపాదనలు 

ఖమ్మం జిల్లాలో వివిధ కారణాలతో 88 రేషన్‌దుకాణాలు ఖాళీగా ఉన్నట్లు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు ప్రతిపాదనలు పంపించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న రేషన్‌డీలర్ల వివరాలను పంపించాలంటూ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో ఆ వివరాలను ప్రభుత్వానికి నివేదించారు. ఏళ్లతరబడి డీలర్ల పోస్టులు ఖాళీగా ఉండటంతో సమీపంలోని డీలర్లకు ఇన్‌చార్జ్‌ బాధ్యతలను అప్పగించడంతో అవకతవకలు జరుగుతున్నాయని, నిరుపేదలకు సక్రమంగా రేషన్‌ అందడం లేదన్న విమర్శలున్నాయి. కొత్తగా రేషన్‌ కార్డులను మంజూరు చేస్తున్న ఈ నేపథ్యలోఓ లబ్ధిదారులకు మెరుగైన సేవలను అందించేందుకు వీలుగా డీలర్ల భర్తీకి ప్రభుత్వం యోచిస్తోంది. 

ఇరుజిల్లాల్లో ప్రస్తుత కార్డుల పరిస్థితి

ఖమ్మం జిల్లా భద్రాద్రి జిల్లా

ఆహార భద్రతా కార్డులు         : 4,05,340 2,67,695 

అంత్యోదయ కార్డులు            : 73,182 18,779

అన్నపూర్ణ కార్డులు         : 5         4

మొత్తం యూనిట్లు (సభ్యులు) : 11,40,814 8,93,925

జిల్లాకు కేటాయించిన ఉచిత బియ్యం :19,317మె.ట 3086.957 మెట్రిక్‌ టన్నులు

ప్రతి సభ్యునికి ఇచ్చే బియ్యం        : 15 కేజీలు 5కిలోలు


రెండేళ్లుగా అందిన దరఖాస్తులు

            ఖమ్మం జిల్లా భద్రాద్రి జిల్లా

దరఖాస్తులు              40,144 55,608

రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ లాగిన్‌లో  9,317 80

తహాసీల్దారు లాగిన్‌లో                   840         7

డీఎస్వో లాగిన్‌లో         8611 21,752

కొత్తగా మంజూరైనవి

                ఖమ్మం జిల్లా భద్రాద్రి జిల్లా

విచారణ చేసి కమిషనర్‌కు పంపినవి 16,889 15.953

అర్హత సాధించినవి 16,089 12,574

మంజూరైనవి         12,108 12,574

తిరస్కరించినవి 3,945 3,379

తహసీల్దార్‌ లాగిన్‌లో పెండింగ్‌ నిల్‌ నిల్‌

కొత్త రేషన్‌ కార్డుల పంపిణీకి శ్రీకారం నేడు

మంత్రి పువ్వాడ చేతుల మీదుగా ప్రారంభం

ఖమ్మం కలెక్టరేట్‌: కొత్తగా మంజూరైన రే షన్‌ కార్డుల పంపిణీకి సోమవారం రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ శ్రీకారం చుట్టనున్నారు. నగరంలోని డీపీఆర్సీ భవనంలో సోమవారం జరిగే ప్రత్యేక కార్యక్రమంలో రఘునాథపాలెం మండలానికి చెందిన లబ్ధిదారులకు రేషన్‌కార్డులను అందజేయనుండగా.. ఇందుకోసం పౌరసరఫరాల శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 12,111 కార్డులను కొత్తగా మంజూరు చేసింది. మండలాల వారీగా చూస్తే బోనకల్‌ 491, చింతకాని 646, ఏన్కూరు 234, కల్లూరు 507, కామేపల్లి 267, ఖమ్మం అర్బన్‌ 2076, ఖమ్మం రూరల్‌ 620, కొణిజర్ల 463, కూసుమంచి 638, మధిర 666, ముదిగొండ 587, నేలకొండపల్లి 587, పెనుబల్లి 548, రఘునాధపాలెం 425, సత్తుపల్ల్లి 716, సింగరేణి 477, తల్లాడ 425, తిరుమలాయపాలెం 291, వేంసూరు 290, వైరా 441, ఎర్రుపాలెం 716 కార్డులు మంజూరయ్యాయి. 

Updated Date - 2021-07-26T04:58:15+05:30 IST