అర్హులైన వారందరికీ రేషన్‌ కార్డులు

Jul 27 2021 @ 23:00PM
రేషన్‌ కార్డులు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే కోనేరు కోనప్ప

- జడ్పీ చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మి

జైనూరు, జూలై 27: అర్హులైన పేద కుటుంబాలందరికీ ప్రభుత్వం రేషన్‌కార్డులు మంజూరు చేస్తుందని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మి అన్నారు. మండలకేంద్రంలోని ఎంపీడీవో సమావేశ మందిరంలో మంగళవారం ఆమె ఆసిఫాబాద్‌ ఎమ్యెల్యే ఆత్రం సక్కుతో కలిసి 189 మంది కుటుంబాలకు రేషన్‌ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటివరకు దరఖాస్తు చేసుకున్న పేదలకు ప్రభుత్వం తెల్ల రేషన్‌ కార్డులు అందించిందన్నారు. మిగిలిన అర్హులు రేషన్‌ కార్డుల కోసం అన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే ఆత్రం సక్కు మాట్లాడుతూ మునుపెన్నడూ లేని విధంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కోట్లాది రుపాయలతో బడుగు బలహీన వర్గాల కోసం ఖర్చు చేస్తుందన్నారు.  జిల్లా గ్రంథాలయ సంస్థ చెర్మన్‌ కనక యాదవ్‌రావ్‌, ఎంపీపీ కుంరం తిరుమల, రాష్ట్ర హజ్‌ కమిటీ సభ్యులు ఇంతీయాజ్‌లాల్‌, కో-అప్షన్‌ సభ్యులు ఫెరోజ్‌ఖాన్‌, జిల్లా సినియర్‌ నాయకులు మేస్రం అంబాజీ, కుంరం విశ్వనాథ్‌, మార్కెట్‌ కమిటీ చెర్మన్‌ ఆత్రం భగ్వంత్‌రావ్‌, సహకార సంఘం చైర్మన్‌ కొడప హన్నుపటేల్‌, వైస్‌ ఎంపీపీ చిర్లె లక్ష్మణ్‌, ఎంపీడీవో ప్రభుదయ, తహసీల్దార్‌ సాయన్న, మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు మడావి భీంరావ్‌, జైనూరు మేజర్‌ గ్రామ పంచాయతీ సర్పంచ్‌ మేస్రం పార్వతీబాయి, స్పంచులు, ఎంపీటిసిలు వీఅర్వోలు, అర్‌ఐ లీలాబాయి, లబ్దిదారులు పాల్గొన్నారు.

సిర్పూర్‌(యు): రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ప్రజల దరికి చేరేలా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని  జడ్పీ చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మి అన్నారు. స్థానిక ఎంపీడివో సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన తెల్లరేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఇంతకు ముందు అన్‌లైన్‌లో కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్న 151 మంది అర్హులకు ప్రభుత్వం రేషన్‌ కార్డులు మంజూరు చేసిందన్నారు. ఎమ్మెల్యే ఆత్రం సక్కు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఇబ్బందులను గుర్తించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జైనూరు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఆత్రం భగ్వంత్‌రావ్‌, ఎంపీపీ తొడ్సం భాగ్యలక్ష్మీ, వైస్‌ ఎంపీపీ ఆత్రం ప్రకాష్‌, సహకార చైర్మెన్‌ కేంద్రె శివాజీ, టిఅర్‌ఎస్‌ మండల అధ్యక్షులు తొడ్సం ధర్మారావ్‌, ఎంపీడిఒ మధుసుధన్‌, తహసీల్దార్‌ రహిమొద్దిన్‌ సర్పంచులు, ఎంపీటిసిలు, విఅర్‌ఎలు తదితరులు ఉన్నారు.

  పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

- సిర్పూర్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప

చింతలమానేపల్లి: పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని సిర్పూర్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. చింతలమానేపల్లి మండల కేంద్రంలోని ప్రజా పరిషత్‌ కార్యాలయంలో మంగళవారం మండలంలోని పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు నూతనంగా మంజూరైన రేషన్‌ కార్డులు, కళ్యాణలక్ష్మి, షాదీ ముభారక్‌ చెక్కులను స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం పేదల కోసం అన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. కార్యక్ర మంలో ఎంపీపీ డుబ్బుల నానయ్య, జడ్పిటీసీ డుబ్బుల శ్రీదేవి, డీఎస్‌ఓ స్వామికుమార్‌, కాగజ్‌నగర్‌ మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ డోకె రాజన్న,  తహసీల్దార్‌ బికర్నిదాస్‌, ఎంపిడీఓ సుధాకర్‌ రెడ్డి, మాజీ ఎంపీపీ డుబ్బుల వెంకయ్య, కో ఆప్షన్‌ సభ్యుడు నాజీమ్‌ హుస్సేన్‌, ఆళీూ గ్రామాల సర్పంచులు, ఎంపిటీసీలు, తదితరులు పాల్గొన్నారు. 

Follow Us on: