డీలర్ల సమస్యలపై దశలవారీ పోరాటం

ABN , First Publish Date - 2021-11-29T06:17:07+05:30 IST

రేషన్‌ డీలర్ల సమ స్యలపై వివిధ రూపాల్లో దశలవా రీ పోరాటానికి సిద్ధమవుతున్నామ ని రేషన్‌ డీలర్ల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు దివి లీలామాధవరావు తెలిపారు.

డీలర్ల సమస్యలపై దశలవారీ పోరాటం

రేషన్‌ డీలర్ల సమాఖ్య వెల్లడి

అమరావతి, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): రేషన్‌ డీలర్ల సమ స్యలపై వివిధ రూపాల్లో దశలవా రీ పోరాటానికి సిద్ధమవుతున్నామ ని రేషన్‌ డీలర్ల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు దివి లీలామాధవరావు తెలిపారు. అఖిల భారత డీలర్ల సంఘం సూచనల మేరకు కార్యా చరణ రూపొందించుకున్నామన్నా రు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన డోర్‌ డెలివరీ విధానం చట్ట విరుద్ధ మని, దీన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. తొలుత డిసెం బరు మొదటి వారంలో ఢిల్లీ వెళ్లి కేంద్ర పౌరసరఫరాల అధికారులకు వినతిపత్రాలు అందజేస్తామని, సమస్య పరిష్కారం కానిపక్షంలో హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేస్తామని ఆదివారం వివరించారు. డీలర్ల వద్ద ఉండే ఖాళీ గోనె సం చులను ఎలాంటి పరిహారం లేకుం డా వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలని, సంచులపై హక్కులు డీలర్లకే ఉండాలని అన్నారు. 

Updated Date - 2021-11-29T06:17:07+05:30 IST