అవకతవకలకు పాల్పడితే చర్యలు’

ABN , First Publish Date - 2022-01-22T05:56:58+05:30 IST

రేషన్‌ పంపిణీలో అవకతవకలకు ప్పాలడితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏఎస్‌వో పి.విజయ్‌భాస్కర్‌ హెచ్చరించారు.

అవకతవకలకు పాల్పడితే చర్యలు’

కరప, జనవరి 21: రేషన్‌ పంపిణీలో అవకతవకలకు ప్పాలడితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏఎస్‌వో పి.విజయ్‌భాస్కర్‌ హెచ్చరించారు. కరపలో శుక్రవారం రేషన్‌డీలర్లు, ఎమ్‌డీయూ ఆపరేటర్లతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజాపంపిణీ వ్యవస్థలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. జాయింట్‌ కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ ఆదేశాల మేరకు పీడీఎస్‌ బియ్యం కొన్నవారిపై రూ.లక్ష వరకు అపరాధరుసుం వసూలుచేస్తామన్నారు. వ్యాపారులు కొంటే వారి లైసెన్స్‌లను రద్దుచేస్తామని, రైస్‌మిల్లర్లు కొనుగోలుచేస్తే కఠినచర్యలు తీసుకుంటామన్నారు. స్టాక్‌ పాయింట్‌ వద్ద ఇస్తున్న బియ్యం, ఇతర సరుకుల తూకాల్లో తేడాలు వస్తున్నాయని, గన్నీ బ్యాగ్‌లు చిరిగిపోవడంతో డీలర్లు నష్టపోతున్నారని మండల రేషన్‌ డీలర్ల సంఘం అధ్యక్షుడు నల్లా వెంకటేశ్వరరావు ఏఎస్‌వో దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై అవసరమైన చర్యలు తీసుకుని డీలర్లు నష్టపోకుండా చూస్తామని ఏఎస్‌వో హామీ ఇచ్చారు. ఎంఎస్‌వో పీసపాటి సుబ్బారావు, ఆర్‌ఐ పేపకాయల మాచరరావు పాల్గొన్నారు.

చౌక బియ్యం పక్కదోవ పట్టిస్తే కఠిన చర్యలు

పిఠాపురంరూరల్‌, జనవరి 21: చౌకధరల దుకాణాల ద్వారా సరఫరా అయ్యే బియ్యా న్ని పక్కదోవ పట్టిస్తే కఠినచర్యలు తీసుకోవడంతోపాటు క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని పిఠాపురం తహశీల్దారు వరహాలయ్య హెచ్చరించారు. తహశీల్దారు కార్యాలయంలో శుక్రవారం రేషన్‌ డీలర్లు, ఎండీయూ ఆపరేటర్లతో సమావేశం నిర్వహించారు. డీలర్లు, ఆపరేటర్ల కార్డుదారులు బియ్యం కొని ఇతరులకి విక్రయిస్తే చర్యలు తప్పవని, ఆథరైజేషన్‌ రద్దు చేస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో సివిల్‌సప్లైస్‌ డీటీ లక్ష్మీరమణి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-22T05:56:58+05:30 IST