రేషన్‌ సరుకులను పారద ర్శకంగా పంపిణీ చేయాలి

ABN , First Publish Date - 2022-07-07T05:41:51+05:30 IST

రేషన్‌ సరుకులను పారద ర్శకంగా పంపిణీ చేయాలి

రేషన్‌ సరుకులను పారద ర్శకంగా పంపిణీ చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న ఆర్‌డీవో వెంకటాచారి

కందుకూరు, జూలై 6: రేషన్‌ సరకులను ప్రజలకు పారదర్శకంగా పంపిణీ చేయాలని కందుకూరు ఆర్‌డీవో వెంకటాచారి తెలిపారు. రేషన్‌ పంపిణీలో అవకతవ కలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన డీలర్లను హెచ్చరించారు. బుధవారం ఎంపీడీవో సమావేశం హాల్‌లో కందుకూరు, మహేశ్వరం, కడ్తాల్‌, ఆమనగల్లు, తలకొండపల్లి, మండలాలకు చెందిన రేషన్‌డీలర్లకు 4జీ బయోమెట్రిక్‌, ఐరీష్‌ మిషన్‌లపై అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. డీలర్లు నిర్దేశించిన రోజుల్లో దుకాణాలు తెరిచి సమయ పాలన పాటించి నాణ్యమైన సరకులను అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి రాఽథోడ్‌, ఏఎ్‌సఓ నర్సింహారావు, తహసీల్దార్‌ జ్యోతి,  రేషన్‌ డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనారాయణగౌడ్‌, ఆర్‌ఐలు ప్రేమ్‌కుమార్‌, హైదర్‌అలీ, సత్తార్‌, వీఆర్‌ఏల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎడ్ల వెంకటేష్‌, ఆయా మండలాలకు చెందిన రేషన్‌ డీలర్లు, వీఆర్‌వోలు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-07T05:41:51+05:30 IST