కర్ఫ్యూలో రేషన్‌ సరుకుల గోల

ABN , First Publish Date - 2021-05-09T06:11:44+05:30 IST

అసలే కరోనా వైరస్‌ వ్యాప్తి తీవ్రతరమై అయి పాజిటివ్‌ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి

కర్ఫ్యూలో రేషన్‌ సరుకుల గోల
రేషన్‌ కోసం స్టోర్‌ వద్ద గుమికూడిన లబ్ధిదారులు


డీలర్‌ షాపుల వద్ద ఎగబడుతున్న జనం

యాడికి, మే 8: అసలే కరోనా వైరస్‌ వ్యాప్తి తీవ్రతరమై అయి పాజిటివ్‌ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కట్టడి ప్రభుత్వం కర్ఫ్యూ విధించి, 144సెక్షన్‌ అమలు చేస్తోం ది. అయినా యాడికిలో ఒక రేషన్‌ దుకాణం వద్ద గుంపులు గుంపులుగా రేషన్‌ కోసం వచ్చిన లబ్ధిదారులను చూస్తే కొవిడ్‌ నిబంధనలు ఏవీ అమలు అవుతున్నట్లు కనిపించ వు. అధికారులేమో ఇంటింటికి రేషన్‌ అందిస్తామని చెబుతున్నారు. వలంటీర్లమో రేషన్‌ లబ్ధిదారులకు ఫోన్‌చేసి స్టోర్‌ వద్దకు వెళ్లి రేషన్‌ తెచ్చుకోమని చెబుతున్నారు. దీంతో శనివారం స్థానిక రేషన్‌ దుకాణం వద్ద సాయంత్రం 5గంటల సమయంలో రేషన్‌ కోసం వచ్చిన లబ్ధిదారులు ఇలా గుంపులు గుంపులుగా కనిపించారు.  

Updated Date - 2021-05-09T06:11:44+05:30 IST