పీడీఎస్‌ బియ్యం రీసైక్లింగ్‌ దందా

ABN , First Publish Date - 2021-05-07T06:46:45+05:30 IST

పీడీఎస్‌ బియ్యం రీసైక్లింగ్‌ దందా

పీడీఎస్‌ బియ్యం రీసైక్లింగ్‌ దందా

  79 క్వింటాళ్ల బియ్యం సీజ్‌ చేసిన రెవెన్యూ అధికారులు


కొత్తగూడ, మే 6 : మండలంలోని పొగుళ్లపల్లిలోని మిల్లులో కొనసాగుతున్న బియ్యం రీసైక్లింగ్‌ దందా గురు వారం వెలుగులోకి వచ్చింది. పొగుళ్లపల్లిలోని నరసింహ స్వామి ట్రేడర్స్‌ మిల్లులో లెవీ నిర్వ హించాల్సి ఉండగా మిల్లు యజమానులు పీడీఎస్‌ బియ్యాన్ని కొనుగోలు చేసి రిసైక్లింగ్‌ దందా కొనసాగిస్తున్నట్లు సమాచారం రావడంతో అధికారు లు అక్కడికి వెళ్లి పరిశీలించారు. తహసీల్దార్‌ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారి విజేందర్‌ మిల్లులో విచారణ చేపట్టారు. మిల్లులోకి పీడీఎస్‌ బియ్యాన్ని తీసు కొచ్చిన రాము అనే వ్యక్తిని ప్రశ్నించారు. తాను పీడీఎస్‌ బియ్యాన్ని మిల్లు నిర్వాహకులకు అప్పగించినట్లు చెప్పడం తో అధికారులు మిల్లులో తనిఖీ చేశారు. అక్కడ 135 సన్న బియ్యం బస్తాలు, 23 ప్లాస్టిక్‌ బస్తాలు కనిపించాయి. మిల్లులో రిసైక్లింగ్‌ దందా కొనసాగుతున్నట్లు ధృవీకరించిన అధికారులు మొత్తం 79 క్వింటాల  బియ్యాన్ని సీజ్‌ చేసినట్లు తహసీల్దార్‌ తెలిపారు. శుక్రవారం సివిల్‌స ప్లాయి అధికారులు మిల్లులో విచారణ చేపట్టి అక్రమాలు జరిగినట్లు తేలితే తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు తహసీల్దార్‌ వెల్లడించారు. 


Updated Date - 2021-05-07T06:46:45+05:30 IST