పీడీఎస్‌ బియ్యం పట్టివేత

ABN , First Publish Date - 2020-08-08T09:12:29+05:30 IST

రేషన్‌ బియ్యం పక్కదారి పడుతున్నాయి.

పీడీఎస్‌ బియ్యం పట్టివేత

8 వేల కిలోలు స్వాధీనం


కొత్తవలస రూరల్‌ (ఎల్‌.కోట), ఆగస్టు 7: రేషన్‌ బియ్యం పక్కదారి పడుతున్నాయి. ఎల్‌.కోట మండలం సోంపురంలో శుక్రవారం 8 వేల కిలోల పీడీఎస్‌ బియ్యం అధికారులకు పట్టుబడ్డాయి. లక్ష్మీనరసింహ ట్రేడర్స్‌ రైస్‌మిల్లులో విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. అదే సమయంలో రెండు ఆటోల్లో తరలిస్తున్న బియ్యాన్ని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.


పీడీఎస్‌ బియ్యం తెచ్చి గోనెలు మార్చి అధిక ధరకు విక్రయిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. మొత్తం 8 వేల కిలోల బియ్యాన్ని అధికారులు పట్టుకొని సీజ్‌ చేశారు. రైస్‌మిల్లు యజమానిపై 6ఏ కేసు నమోదుచేసినట్టు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఎస్‌ఐ డీడీ నాయుడు తెలిపారు. పట్టుకున్న బియ్యాన్ని స్థానిక సివిల్‌ సప్లయ్స్‌ గొడౌన్‌కు తరలించినట్టు చెప్పారు. తనిఖీల్లో స్థానిక ఎస్‌ఐ ప్రయోగమూర్తి, సీఎస్‌డీటీ రామారావు పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-08T09:12:29+05:30 IST