Advertisement

రేషన్‌ బియ్యం పట్టివేత

Jan 23 2021 @ 22:32PM
పట్టుబడిన రేషన్‌ బియ్యంతో పోలీసులు

గండీడ్‌, జనవరి 23: అక్రమంగా తరలిస్తు న్న 50 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని నంచర్ల గేట్‌ ద గ్గర టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది శనివారం పట్టుకొని మహమ్మదాబాద్‌ పోలీసులకు అప్పగించారు. ఎస్‌ఐ రాములు తెలిపిన వివరాల ప్రకారం.. కుల్కచర్లకు చెందిన అంగడి రమేష్‌, మొకార్ల బాద్‌ కు చెందిన సంగమేశ్వర్‌ అక్ర మంగా రేషన్‌ బియ్యం వ్యాపారం నిర్వహి స్తున్నారు. సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది దాడులు నిర్వహించి  రమేష్‌ ద గ్గర ఐదు క్వింటాళ్లు,  సం గమేశ్వర్‌ దగ్గర 45క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నా రు. ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

ఊట్కూర్‌ మండలంలో..

ఊట్కూర్‌ :  మండల కేంద్రం నుంచి కర్ణాటక రాష్ట్రంలోని గుర్మిట్‌కాల్‌కు పీడీఎస్‌ బియ్యాన్ని తరలిస్తున్న వాహనాన్ని శనివారం తెల్లవారుజామున ఊట్కూర్‌ పోలీసులు పట్టుకున్నారు.   ఎస్సై రవి తెలిపిన వివరాల ప్రకారం.. ఊట్కూర్‌ గ్రామానికి చెందిన ఎండీ నాసీర్‌ అనే  వ్యక్తి 10 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యాన్ని బొలెరో వాహనంలో తీసుకొని వెళ్తుండగా శనివారం చెక్‌పోస్టు వద్ద పోలీసులు పట్టుకోని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అ నంతరం సివిల్‌ సప్లై అధికారులకు సమాచారం ఇవ్వడంతో డీటీ వచ్చి పంచనామ నిర్వహిం చారు. అక్రమంగా పీడీఎస్‌ బియ్యం తరలిస్తున్న వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు  చేస్తున్నట్లు ఎస్సై రవి తెలిపారు.  

Follow Us on:
Advertisement