రేషన్‌ బియ్యం పట్టివేత

ABN , First Publish Date - 2022-01-28T04:23:52+05:30 IST

జిల్లాలో రేషన్‌ బియ్యం పక్కదారి పడుతున్నాయి. విజిలెన్స్‌ అధికారుల దాడుల్లో భారీగా నిల్వలు పట్టుబడుతున్నాయి. గురువారం ఇచ్ఛాపురం మునిసిపాలిటీ పరిధిలో మూడుచోట్ల అక్రమంగా నిల్వ ఉన్న 44.60 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని సీజ్‌ చేశామని సీఎస్‌డీటీ శంకరరావు తెలిపారు.

రేషన్‌ బియ్యం పట్టివేత
వంగరలో బియ్యం నిల్వలు పరిశీలిస్తున్న అధికారులు

ఇచ్ఛాపురంలో 44.60 క్వింటాళ్లు సీజ్‌

ఇచ్ఛాపురం/వంగర, జనవరి 27: జిల్లాలో రేషన్‌ బియ్యం పక్కదారి పడుతున్నాయి. విజిలెన్స్‌ అధికారుల దాడుల్లో భారీగా నిల్వలు పట్టుబడుతున్నాయి. గురువారం ఇచ్ఛాపురం మునిసిపాలిటీ పరిధిలో మూడుచోట్ల అక్రమంగా నిల్వ ఉన్న 44.60 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని సీజ్‌ చేశామని సీఎస్‌డీటీ శంకరరావు తెలిపారు. లాలాపేట, గొల్లవీధి, వాసుదేవపేటలోని వివిధ ఇళ్లల్లో అక్రమంగా రేషన్‌ బియ్యం నిల్వ ఉన్నట్లు సమాచారం అందడంతో  దాడులు చేశామని చెప్పారు. ఈ మేరకు 51 బియ్యం మూటలను స్వాఽఽధీనం చేసుకొని సంబందిత  వ్యక్తులపై కేసులు నమోదు చేశామని తెలిపారు. కార్యక్రమంలో ఆర్‌ఐ శ్రావణ్‌కుమార్‌ పాల్గొన్నారు. 


‘వంగర’లో నలుగురిపై 6ఏ కేసు నమోదు

వంగర మండలం బాగెమ్మపేటలో రేషన్‌ బియ్యం అక్రమంగా నిల్వ ఉంచిన నలుగురిపై 6ఏ కేసు నమోదైంది. గ్రామంలో గత కొంతకాలంగా రేషన్‌ బియ్యం అక్రమ రవాణా చేస్తున్నారన్న ఫిర్యాదు విజిలెన్స్‌ అధికారులకు అందింది. ఈ నేపథ్యంలో గురువారం విజిలెన్స్‌ ఎస్‌ఐ రామారావు ఆధ్వర్యంలో అధికారులు తనిఖీలు చేశారు. గ్రామానికి చెందిన దత్తి ఉమామహేశ్వరరావు గోదాములో 50 కేజీల బస్తాలు 10, పసుమర్తి కృష్టారావు వద్ద 34, శంకరరావు వద్ద 39, వడ్డి సూర్యారావు దగ్గర 25 బస్తాలు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని స్థానిక డీలర్‌ పసుమర్తి గౌరీకి అప్పగించారు. గ్రామంలో పూర్తిగా విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని విజిలెన్స్‌ ఎస్‌ఐ రామారావు, తహసీల్దార్‌ ఐజాక్‌ తెలిపారు. నలుగురిపై 6 ఏ కేసు నమోదు చేశామన్నారు.

Updated Date - 2022-01-28T04:23:52+05:30 IST