పక్కదారి పడుతున్న రేషన బియ్యం

ABN , First Publish Date - 2021-06-13T06:41:00+05:30 IST

రేషన బియ్యం పక్కదారి పడుతోంది. ఉరవకొండ కేంద్రంగా రేషన బియ్యం వ్యాపారం యథేచ్ఛగా సాగుతోంది.

పక్కదారి పడుతున్న రేషన బియ్యం
పట్టుబడిన రేషన బియ్యం (ఫైల్‌ ఫొటో)

ఉరవకొండ, జూన 12: రేషన బియ్యం పక్కదారి పడుతోంది. ఉరవకొండ కేంద్రంగా రేషన బియ్యం వ్యాపారం యథేచ్ఛగా సాగుతోంది. కరోనా నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మే, జూన నెలలకు సంబంధించి కా ర్డుదారులకు 10 కేజీల చొప్పున ఉచితంగా బియ్యం సరఫరా చేస్తున్నారు. సదుద్దేశంతో చేపట్టిన ఈ ఉచిత బియ్యం పక్కదారి పడుతోంది. అధికారు లు కొవిడ్‌ విధుల్లో నిమగ్నం కాగా.. అక్రమార్కులు రేషన బియ్యం ఇతర ప్రాంతాలకు గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్నారు. పౌరసరఫరాల అధికారులు దృష్టి పెట్టకపోవడంతో వ్యాపారులు బరితెగిస్తున్నారు. కార్డుదారు ల నుంచి కేజీ రూ.8లకు కొనుగోలు చేసి కర్ణాటక ప్రాంతానికి తరలించి రూ.20లు దాకా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. అక్రమ సంపాదనకు రేషన బియ్యాన్ని అడ్డదారిగా ఎంచుకున్నారు. ఉరవకొండ పరిసర ప్రాంతాల నుంచి రోజుకు 2, 3 లారీల దాకా కర్ణాటక ప్రాంతానికి రేషన బియ్యాన్ని వ్యాపారులు తరలిస్తున్నారు. 


ఇంటింటికి తిరిగి సేకరణ

రేషన పంపిణీలో భాగంగా ప్రభుత్వం మినీ ట్రక్కులతో కార్డుదారులకు రేషన అందిస్తున్నారు. అయినా బియ్యం పక్కదారి పడుతూనే ఉంది. రేషన సరఫరా ప్రారంభమవ్వగానే బియ్యం కొనుగోలు చేసే దళారులు గ్రామాలలో వాలిపోతున్నారు. బియ్యం వ్యాపారులు దళారులను ఏర్పాటు చేసుకు ని, గ్రామాలలో రేషనకార్డుదారుల ఇంటింటికి పంపి కేజీకి రూ.8 నుంచి రూ.10 దాకా సేకరిస్తున్నారు. ఆ బియ్యాన్ని ఆటోలలో ఉరవకొండకు తరలిస్తున్నారు. భారీగా నిల్వలు పెట్టి లారీలలో కర్ణాటకకు అక్రమంగా రవాణా చేస్తున్నారు. 

       

పట్టుబడిన వారిపై 6ఏ కేసులు నమోదు చేస్తుండడంతో వ్యా పారులు పెద్దగా పట్టించుకోవడం లేదు. మరలా అక్రమ బియ్యం వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. వీరిపై అధికారుల నిఘా కొరవడింది. ఎవరైనా స మాచారమిస్తే స్థానిక పోలీసులు వెళ్లి దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నారు. పౌరసఫరాల శాఖాధికారులు అక్రమ బియ్యం రవాణాపై పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. దీంతో వ్యాపారుల పని మరింత సు లువవుతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి వ్యాపారులపై నిఘా పెట్టాల్సిన అవసరముంది.  

Updated Date - 2021-06-13T06:41:00+05:30 IST