Advertisement

పేదల గడపలోకే రేషన బియ్యం

Jan 21 2021 @ 23:46PM
జెండా ఊపి ట్రక్కులను ప్రారంభిస్తున్న మంత్రి, డిప్యూటీ సీఎం, కలెక్టర్‌, తదితరులు

విద్యావ్యవస్థలో పెనుమార్పులు

జిల్లా ఇనఛార్జి మంత్రి ఆదిమూలపు సురేష్‌ 

కడప (నాగరాజుపేట), జనవరి 21: పౌరసరఫరాల వ్యవస్థలో మూడంచెల విధానాన్ని తీసుకొచ్చి పేదల గడపలోకి బియ్యం పంపిణీ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని జిల్లా ఇనఛార్జి మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. కడప మున్సిపల్‌ మైదానంలో గురువారం పౌరసరఫరాల బియ్యం పంపిణీ వాహనాలను 514 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ కులమతాలు, పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. విద్యావ్యవస్థలో పెనుమార్పులు తీసుకొచ్చామని ఫిబ్రవరి 1 నుంచి అన్ని పాఠశాలలు తెరుచుకుంటాయని తెలిపారు. డిప్యూటీ సీఎం అంజద్‌బాషా మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 9,260 బియ్యం ట్రక్కులను ప్రారంభించడం జరిగిందని, అందులో భాగంగా జిల్లాలో 514 ప్రారంభించామన్నారు. సచివాలయ, వలంటీరు వ్యవస్థతో ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. కలెక్టర్‌ హరికిరణ్‌ మాట్లాడుతూ మండలాలు,  మున్సిపాలిటీల్లో అన్ని వర్గాలకు సమన్యాయం చేసి ట్రక్కులకు 514 మంది లబ్ధిదారులను ఎంపిక చేశామని తెలిపారు. కాయగూరల బండిలాగా ప్రతి ఇంటి ముందుకు వాహనం వెళ్లి బియ్యం పంపిణీ చేయాలన్నారు. తప్పుడు కార్యక్రమాలకు టక్కులను వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, ఎమ్మెల్సీ జకియాఖానం, రాష్ట్ర వ్యవసాయ సలహాదారుడు అంబటి కృష్ణారెడ్డి, జేసీలు గౌతమి, సాయికాంతవర్మ, ధర్మచంద్రారెడ్డి, సబ్‌ కలెక్టర్లు పృథ్వీతేజ్‌, కేతనగార్గ్‌, ఈడీలు వెంకటసుబ్బయ్య, జయప్రకాష్‌, కరుణాకర్‌రెడ్డి, జిల్లాలోని తహసీల్దార్లు, వీఆర్వోలు పాల్గొన్నారు.

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.