రేషన షాపు సీజ్‌

ABN , First Publish Date - 2021-07-25T06:36:59+05:30 IST

జిల్లా కేంద్రంలోని వేణగోపాల్‌ నగర్‌లో ఉన్న రేషన షాపు నుంచి అక్రమంగా రేషన బియ్యం తరలిస్తున్నారని ఆ షాపును పౌరసరఫరాల శాఖ అధి కారులు సీజ్‌ చేశారు.

రేషన షాపు సీజ్‌

అనంతపురంరూరల్‌,జూలై24: జిల్లా కేంద్రంలోని వేణగోపాల్‌ నగర్‌లో ఉన్న రేషన షాపు నుంచి అక్రమంగా రేషన బియ్యం తరలిస్తున్నారని ఆ షాపును పౌరసరఫరాల శాఖ అధి కారులు సీజ్‌ చేశారు. అధికారులు తెలిపిన మేరకు... రేషన షా పు నెంబరు-62 డీలర్‌ అక్రమంగా రేషన బియ్యాన్ని తరలిస్తుండగా..స్థానికులు విషయాన్ని డీఎస్‌ఓకు ఫిర్యాదు చేశారన్నారు. ఆయన ఆదేశాల మేరకు రేషన షాపు వద్దకు వెళ్లామన్నారు. అప్పటికే డీలర్‌ షాపునకు తాళం వేసుకుని వెళ్లిపోయారన్నాన్నారు. డీలర్‌కు ఫోన చేసినప్పటికీ స్విచ ఆఫ్‌ రావడంతో మరో తాళం తీసుకొచ్చి షాపును సీజ్‌ చేశామన్నారు. ఆదివారం షాపు తెరచి స్టాక్‌ను లెక్కిస్తామని తెలిపారు. ఈకార్యక్రమంలో సీఎస్‌డీటీలు దుర్గాప్రసాద్‌, మునిస్వామి పాల్గొన్నారు. 


Updated Date - 2021-07-25T06:36:59+05:30 IST