హేతువాద సంఘం మహాసభలు

ABN , First Publish Date - 2021-01-08T06:36:07+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ హేతువాద సంఘం రాష్ట్ర మహాసభలు జనవరి 16, 17 తేదీల్లో ఒంగోలులోని రంగాభవన్‌లో జరుగనున్నాయి. 16వ తేదీ ఉదయం జరిగే సభలో ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ పాల్గొంటారు...

హేతువాద సంఘం మహాసభలు

ఆంధ్రప్రదేశ్‌ హేతువాద సంఘం రాష్ట్ర మహాసభలు జనవరి 16, 17 తేదీల్లో ఒంగోలులోని రంగాభవన్‌లో జరుగనున్నాయి. 16వ తేదీ ఉదయం జరిగే సభలో ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ పాల్గొంటారు. హేతువాద సంఘం అధ్యక్షులు నార్నె వెంకటసుబ్బయ్య అధ్యక్షతన ఈ సభ జరగనుంది. ఉదయం 10.50 నుంచి 11.50 వరకు సోదర సంఘాలు తమ సందేశాలను అందిస్తాయి. మధ్యాహ్నం 12 గంటలకు హేతువాద సంఘం ఉపాధ్యక్షులు ఎం. అశోక్‌ అధ్యక్షతన జరిగే సభలో రాజ్యాంగం అమలుతీరుపై న్యాయవాది చెలిమెల రాజేశ్వర్‌, మతం లేకుండా మనిషి జీవించడమెలా అనే అంశంపై డా. కదిరి కృష్ణ ప్రసంగిస్తారు. మధ్యాహ్నం మూడు గంటలకు రిటైర్డ్‌ లెక్చరర్‌ జె.వి. కృష్ణయ్య అధ్యక్షతన జరిగే సభలో కరోనా కాలంలో శాస్త్రీయ వైద్యవిధానాలు అనే అంశంపై డా. వి. బ్రహ్మరెడ్డి, ఖగోళ విజ్ఞానం అంశంపై యన్‌. రఘునందన్‌ ప్రసంగిస్తారు.


17వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు లెక్చరర్‌ కృష్ణప్రియ అధ్యక్షతన జరిగే సభలో పిండాకూళ్ళు-–ఆత్మలు-–శ్రాద్ధకర్మలు అనే అంశంపై నార్నె వెంకటసుబ్బయ్య, నాస్తికత్వం-–ఆవశ్యకత అనే అంశంపై ప్రముఖ వైద్యులు డా. సమరం ప్రసంగిస్తారు. 11.30 గంటలకు డా. వి.వరప్రసాద్‌ అధ్యక్షతన జరిగే సభలో శాస్త్రీయ విద్యావిధానం అంశంపై శాసనమండలి సభ్యుడు విఠపు బాలసుబ్రమణ్యం, తెలుగు సాహిత్యంలో హేతువాదం అంశంపై డా. బీరం సుందరరావు ప్రసంగిస్తారు. అనంతరం ఎ.పి హేతువాద సంఘం కార్యవర్గ సమావేశం, నూతన కార్యవర్గం ఎన్నిక జరుగుతుంది. అభ్యుదయ సమాజాన్ని ఆశించే వారందరూ ఈ సభలలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం.


నార్నె వెంకటసుబ్బయ్య, హేతువాద సంఘం

Updated Date - 2021-01-08T06:36:07+05:30 IST