రామలింగేశ్వరుడికి రావణ సేవ

ABN , First Publish Date - 2022-06-25T04:49:03+05:30 IST

మండలంలోని రామతీర్థం గ్రామంలో ఉన్న శ్రీ కామాక్షీదేవి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం స్వామికి రావణసేవ ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు.

రామలింగేశ్వరుడికి రావణ సేవ

గ్రామంలో ఊరేగిన స్వామి, అమ్మవారు

విడవలూరు, జూన్‌ 24: మండలంలోని రామతీర్థం గ్రామంలో ఉన్న శ్రీ కామాక్షీదేవి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం స్వామికి  రావణసేవ ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. తొలుత ఆలయ పూజారులు శ్రీకాంత్‌ శర్మ, శ్రీనివాస శర్మలు గణపతి పూజ, స్వామి ,అమ్మవార్లకు పున్యావహచన, మహన్యా రుద్రాభిషేకాలు, కుంకు మార్చనలు, నివేదన, బలిహరణ పూజలు చేశారు. అనంతరం గ్రామ పురవీధుల్లో శివుడికి గిన్ని భిక్ష ఉత్సవాలను నిర్వహించారు. సాయంత్రం గౌడసంఘం ఆధ్వర్యంలో రామలింగేశ్వరుడికి పూలంగి సేవ చేశారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన రావణ వాహనంపై స్వామి అమ్మవారుఊరేగారు. ఈ వేడుకలకు రామతీర్థం గ్రామానికి చెందిన గౌడ సంఘం వారు ఉభయకర్తలుగా వ్యవహరించారు. ఆలయ చైర్మన్‌ నాటారు చంద్రయ్య, ఈవో వెంకటేశ్వర్లు, గ్రామ దేవదాయ శాఖ అసిస్టెంట్‌ వెంకటేశ్వర్లు, గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు.

హోరాహోరీగా రాష్ట్ర స్థాయి బండిలాగుడు పోటీలు 

బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని రామతీర్థం గ్రామంలో శుక్రవారం గౌడ సంఘం ఆధ్వర్యాన రాష్ట్ర స్థాయి బండిలాగుడు పోటీలను నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుంచి సుమారు 20 జట్లు  పాల్గొన్నాయి. పాత చీరాలకి చెందిన ఈశ్వర్‌ జట్టు మొదటి స్థానం, బాపట్లకి చెందిన ఎంకె బుల్స్‌ ద్వీతీయ, బుచ్చిరెడ్డి పాళెం జొన్నవాడకి చెందిన మద్దిశెట్టి అంకయ్య తృతీయ, బోయనపల్లి బాపట్లకి చెందిన వర్లపోతురాజు జట్టు నాల్గొవ, విడవలూరు మండలం వావిళ్ల గ్రామానికి చెందిన చక్రపాణి గౌడ్‌ జట్టు ఐదో స్థానాల్లో నిలిచాయి. విజేత జట్టు యజమానులకు గౌడసంఘం నాయకులు పూడి సుబ్రహ్మణ్యం గౌడ్‌, యల్లసిరి లక్ష్మణగౌడ్‌, ఉప్పాల శివకృష్ణయ్య గౌడ్‌, తాతా మల్లికార్జున గౌడ్‌, అత్తిరాల శీనయ్యగౌడ్‌ నగదు బహుమతులు, జ్ఞాపికలను అందజేశారు.

Updated Date - 2022-06-25T04:49:03+05:30 IST