దుబాయి ప్రకటన ఎఫెక్ట్.. భారీగా పెరిగిన విమాన టికెట్ ధరలు!

ABN , First Publish Date - 2021-06-21T18:13:58+05:30 IST

భారత నుంచి వచ్చే ప్రయాణికులకు దుబాయి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పలు కారణాలతో ఇండియాకు వచ్చి.. కరోనా నేపథ్యంలో ఇక్కడే చిక్కుకుపోయిన ప్రవాస భారతీయులు తిరిగి ఈ నెల 23 నుంచి తిరిగి

దుబాయి ప్రకటన ఎఫెక్ట్.. భారీగా పెరిగిన విమాన టికెట్ ధరలు!

దుబాయి: భారత నుంచి వచ్చే ప్రయాణికులకు దుబాయి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పలు కారణాలతో ఇండియాకు వచ్చి.. కరోనా నేపథ్యంలో ఇక్కడే చిక్కుకుపోయిన ప్రవాస భారతీయులు తిరిగి ఈ నెల 23 నుంచి తిరిగి దుబాయికి పయనవతున్నారు. ఈ నేపథ్యంలో ట్రావెల్ ఏజెంట్లకు ఫోన్ కాల్స్ పెరిగాయి. యూఏఈ ఆమోదం పొందిన కొవిడ్ టీకాలు ఏంటి? సింగిల్ డోసు తీసుకున్నప్పటికీ దుబాయి వెళ్లొచ్చా? వీసా గడువు ముగిసిన వారిని కూడా అనుమతిస్తుందా? ప్రయాణానికి నాలుగు గంటల ముందు ర్యాపిడ్ పీసీఆర్ టెస్ట్ తప్పనిసరిగా చేయించుకోవాలా? ఈ టెస్టు కేంద్రాలు అందుబాటులో లేకపోతే పరిస్థితి ఏంటి? అనే సందేహాలను ప్రవాసులు వ్యక్తం చేస్తున్నారు. అయితే ట్రావెల్ ఏజెంట్లు కూడా వారికి తెలిసిన సమాచారం మేరకు ప్రయాణికుల సందేహాలను నివృత్తి చేస్తున్నారు.



ఇదిలా ఉంటే.. ప్రయాణ ఛార్జీలు భారీగా పెరిగినట్టు తెలుస్తోంది. గతంలో 600-800దిర్హమ్‌లు ఉన్న టికెట్ ధర ప్రస్తుతం 1,385 దిర్హమ్‌లకు పెరిగినట్టు వార్తలొస్తున్నాయి. ఈ విషయాన్ని ప్లూటో ట్రావెల్స్‌కు సంబంధించిన ప్రతినిధి కూడా స్పష్టం చేశారు. ఢిల్లీ, ముంబై నుంచి దుబాయి వెళ్లేందుకు విమాన టికెట్ ధర 600-800 దిర్హమ్‌ల మధ్య ఉండేదని.. అయితే ప్రస్తుతం అది 1,385 దిర్హమ్‌లకు పెరిగినట్టు పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి దుబాయి వెళ్లే ప్రయాణికులు 1,345 దిర్హమ్‌ల డబ్బును చెల్లించాల్సి ఉంటుందన్నారు. చాలా రోజుల తర్వాత పరిమిత సంఖ్యలో విమాన సర్వీసలు అందుబాటులోకి రావడంతోపాటు హై డిమాండ్ కారణంగా టికెట్ రేట్లు పెరిగాయని సదరు ప్రతినిధి అభిప్రాయపడ్డారు. అయితే జూలై 5 నాటికి టికెట్ రేట్లు తగ్గొచ్చని అంచనా వేశారు. 


Updated Date - 2021-06-21T18:13:58+05:30 IST