ర‌వితేజ ‘ఖిలాడి’.. తాజా అప్‌డేట్

Sep 24 2021 @ 18:18PM

మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కాంబోలో  బాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ పెన్ స్టూడియోస్, ఏ స్టూడియోస్, హవీష్ ప్రొడక్షన్‌ సంయుక్తంగా నిర్మిస్తోన్న యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘ఖిలాడి’. ప్లే స్మార్ట్ అనేది ట్యాగ్‌లైన్. సత్యనారాయణ కోనేరు నిర్మాత. ఈ మూవీలో రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర అప్‌డేట్‌ను చిత్రయూనిట్ తెలియజేసింది. ప్రస్తుతం ఈ చిత్రం రెండు పాటలు మినహా టాకీ పార్ట్ పూర్తయినట్లుగా ఈ అప్‌డేట్‌లో ప్రకటించారు. కాగా, ఇటీవల రిలీజ్ చేసిన టీజర్‌కి, వినాయక చవితి సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ సాంగ్‌ ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను అందుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ వచ్చింది. రెండు పాటలు మినహా టాకీ పార్ట్ మొత్తం పూర్తయిందని, మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నట్లుగా చిత్రయూనిట్ ప్రకటించింది.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.