రవ్వ కేక్‌

ABN , First Publish Date - 2020-12-25T20:13:01+05:30 IST

నూనె, పెరుగు, పాలు - అరకప్పు చొప్పున, రవ్వ - ఒకటింబావు కప్పు, పంచదార పొడి - ఒక కప్పు, మైదా - అర కప్పు, పాలపొడి - 2 టేబుల్‌ స్పూన్లు, బేకింగ్‌ సోడా, బేకింగ్‌

రవ్వ కేక్‌

కావలసిన పదార్థాలు: నూనె, పెరుగు, పాలు - అరకప్పు చొప్పున, రవ్వ - ఒకటింబావు కప్పు, పంచదార పొడి - ఒక కప్పు, మైదా - అర కప్పు, పాలపొడి - 2 టేబుల్‌ స్పూన్లు, బేకింగ్‌ సోడా, బేకింగ్‌ పౌడర్‌ - అర టీ స్పూను చొప్పున, వెనిలా ఎసెన్స్‌ - అర టీ స్పూను, డ్రైఫ్రూట్స్‌ తరుగు - అరకప్పు.


తయారుచేసే విధానం: మిక్సింగ్‌ బౌల్‌లో నూనె, పెరుగు, పాలు వేసి గిలకొట్టి రవ్వ (ఉండలు లేకుండా) కలపాలి. తర్వాత పంచదార పొడి, మైదా, పాలపొడి, బేకింగ్‌ సోడా+పౌడర్‌, ఉప్పు, వెనిలా ఎసెన్స్‌, డ్రైఫ్రూట్స్‌ వేసి బాగా కలిపి బేకింగ్‌ బౌల్‌లో మిశ్రమం వేసి ఒవెన్‌లో 180 డిగ్రీల వద్ద 10 నిమిషాలు ప్రీహీట్‌ చేసి 40 నిమిషాలు ఉంచాలి. టూత్‌ పిక్‌తో చెక్‌ చేసి తీసి, చల్లారిన తర్వాత ముక్కలుగా కోయాలి.


Updated Date - 2020-12-25T20:13:01+05:30 IST