రవ్వ వడ

ABN , First Publish Date - 2021-10-13T17:22:30+05:30 IST

రవ్వ - కప్పు, పెరుగు - ముప్పావు కప్పు, ఉల్లి ముక్కలు- అర కప్పు, జీలకర్ర- స్పూను, అల్లం ముక్కలు- పది, కొత్తిమీర తరుగు- రెండు స్పూన్లు, పచ్చి మిర్చి- రెండు, కరివేపాకు- ఓ రెబ్బ, ఉప్పు, నూనె, నీళ్లు- తగినంత.

రవ్వ వడ

కావలసిన పదార్థాలు: రవ్వ - కప్పు, పెరుగు - ముప్పావు కప్పు, ఉల్లి ముక్కలు- అర కప్పు, జీలకర్ర- స్పూను, అల్లం ముక్కలు- పది, కొత్తిమీర తరుగు- రెండు స్పూన్లు, పచ్చి మిర్చి- రెండు, కరివేపాకు- ఓ రెబ్బ, ఉప్పు, నూనె, నీళ్లు- తగినంత.


తయారుచేసే విధానం: ఓ గిన్నెలో రవ్వ, పెరుగు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, అల్లం, ఉల్లిముక్కలు, ఉప్పు అన్నీ వేసి కలపాలి. నీళ్లనూ జతచేసి కలిపి ఓ పావు గంట పక్కన పెట్టాలి. రవ్వ పిండిని చిన్న చిన్న ముద్దలుగా తీసుకుని వడగా తట్టి ఒక్కోటీ నూనెలో వేయించాలి. బంగారు రంగులోకి రాగానే తీసేయాలి.

Updated Date - 2021-10-13T17:22:30+05:30 IST