భారీగా పట్టుబడిన నగదు, బంగారం

ABN , First Publish Date - 2022-03-17T16:52:51+05:30 IST

కృష్ణ జల మండలి అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌గా పని చేస్తున్న అశోక్‌రెడ్డి పాటిల్‌ నివాసంపై ఏకకాలంలో మూడు చోట్ల నిర్వహించిన దాడుల్లో పెద్ద ఎత్తున

భారీగా పట్టుబడిన నగదు, బంగారం

రాయచూరు(బెంగళూరు): కృష్ణ జల మండలి అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌గా పని చేస్తున్న అశోక్‌రెడ్డి పాటిల్‌ నివాసంపై ఏకకాలంలో మూడు చోట్ల నిర్వహించిన దాడుల్లో పెద్ద ఎత్తున బంగారు, నగదు పట్టుబడినట్లు తెలిసింది. ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు అశోక్‌రెడ్డి పాటిల్‌ నివాసంలో డస్ట్‌బిన్‌లో 400 గ్రాముల బంగారు, మరో 600 గ్రాముల వెండి ఆభరణాలు లభించినట్లు తెలిసింది. దీంతో పాటు ఇంట్లో జరిపిన సోదాల్లో రూ.7 లక్షల నగదు, 41 తులాల బంగారు, 60 తులాల వెండి ఆభరణాలు లభించినట్లు తెలిసింది. పట్టుబడిన బంగారు, నగదు ఆభరణాల గురించి ఖచ్చితంగా సమాచారం ఇవ్వని అధికారులు పూర్తి సమాచారాన్ని బెంగళూరు అధికారులే అధికారికంగా ప్రకటిస్తారని చెప్పారు. 

Updated Date - 2022-03-17T16:52:51+05:30 IST