విజయవాడ: రాయలసీమ ధర్మ పోరాట దీక్ష

ABN , First Publish Date - 2021-12-13T18:07:59+05:30 IST

రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆధ్వర్యంలో రాయలసీమ ధర్మ పోరాట దీక్ష చేపట్టింది.

విజయవాడ: రాయలసీమ ధర్మ పోరాట దీక్ష

విజయవాడ: రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆధ్వర్యంలో రాయలసీమ ధర్మ పోరాట దీక్ష చేపట్టింది. ఈ దీక్షలో రాయలసీమ జిల్లాల రైతులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాయలసీమ ప్రజా సంఘాల వేదిక కన్వీనర్‌  దశరాధరామిరెడ్డి మాట్లాడుతూ సీమలోని 45 ప్రజా సంఘాలన్నీ సమన్వయ కమిటీగా ఏర్పడ్డాయన్నారు. రాయలసీమ అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. తమ న్యాయమైన డిమాండ్లను  పరిష్కారించాలని కోరుతున్నామన్నారు. ఆకలి సమస్య, తాగు నీటి సమస్యపై రాజకీయ పార్టీలు స్పందించడం లేదని మండిపడ్డారు.


శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం తమకు న్యాయం చేయాలని దశరాధరామిరెడ్డి కోరారు. ఏపీలోని అన్ని రాజకీయ పార్టీలు రాయలసీమకు అన్యాయం చేశాయని విమర్శించారు. తమ సమస్యలపై స్పందించని రాజకీయ పార్టీలను రాయలసీమ వాసులు బహిష్కరించాలని పిలుపిచ్చారు. కృష్ణా నదీ యాజమాన్య బోర్డులో ఏముందో కూడా తెలియకుండా నాయకులు మాట్లాడుతున్నారని, రాష్ట్రం నడిబొడ్డు నుంచి తమ ఆవేదన వ్యక్తం చేయడానికి ఇక్కడకి వచ్చామన్నారు. కృష్ణా యాజమాన్య బోర్డు విశాఖలో పెట్టడం దుర్మార్గమని, దీనిపై అన్ని రాజకీయ పక్షాలు తమకు మద్దతుగా పోరాడాలని కోరారు. పాలనా వికేంద్రీకరణ అంటున్న జగన్‌కు చిత్తశుద్ధి ఉంటే హైకోర్టును కర్నూలులో పెట్టాలని దశరాధరామిరెడ్డి డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-12-13T18:07:59+05:30 IST