Heavy rain: రాయలసీమకు భారీ వర్షసూచన

ABN , First Publish Date - 2022-08-26T02:10:18+05:30 IST

ఉత్తర తమిళనాడు పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది రానున్న రెండు రోజుల్లో ఉత్తరం వైపుగా పయనించనున్నది.

Heavy rain: రాయలసీమకు భారీ వర్షసూచన

విశాఖపట్నం: ఉత్తర తమిళనాడు పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది రానున్న రెండు రోజుల్లో ఉత్తరం వైపుగా పయనించనున్నది. దీని ప్రభావంతో గురువారం రాయలసీమ (Rayalaseema)లో అక్కడక్కడా  వర్షాలు కురిశాయి. శుక్ర, శనివారాలు రాయలసీమలో అనేకచోట్ల, కోస్తాలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమలో అక్కడక్కడా భారీవర్షాలు (Heavy rain) కురుస్తాయని పేర్కొంది. కాగా గురువారం కోస్తా, రాయలసీమలో అనేక ప్రాంతాల్లో ఎండ తీవ్రత కొనసాగింది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. ఒంగోలులో 37.7, కావలిలో 37.2 డిగ్రీలు నమోదయ్యాయి.

Updated Date - 2022-08-26T02:10:18+05:30 IST