RBI: వారు ఆశ్చర్యపోయేలా తప్పనిసరి సెలవులు ఇవ్వండి.. బ్యాంకులకు ఆర్‌బీఐ ఆదేశం

ABN , First Publish Date - 2021-07-11T01:34:35+05:30 IST

సున్నిత ప్రాంతాల్లో లేదా విధుల్లో ఉన్న ఉద్యోగులను ప్రతిఏటా తప్పనిసరి సెలవులపై పంపించాలంటూ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్ని బ్యాంకులను ఆదేశించింది.

RBI: వారు ఆశ్చర్యపోయేలా తప్పనిసరి సెలవులు ఇవ్వండి.. బ్యాంకులకు ఆర్‌బీఐ ఆదేశం

ముంబై: కీలక విధుల్లో ఉన్న ఉద్యోగులను ఏటా తప్పనిసరిగా సెలవులపై పంపించాలంటూ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) అన్ని బ్యాంకులను ఆదేశించింది. పది రోజులకు తక్కువ కాకుండా వారికి సెలవులు మంజూరు చేయాలని, ఈ విషయంలో ఉద్యోగులు ఆశ్చర్యపోయేలా ముందస్తు సెలవులపై ఎటువంటి సమాచారం వారికి ఇవ్వకూడదని కూడా ఆర్‌బీఐ పేర్కొంది. సవరించిన రిస్క్ మేనేజ్‌మెంట్ మార్గదర్శకాల్లో భాగంగా ఆర్‌బీఐ శుక్రవారం నాడు ఓ సర్క్యులర్‌ను జారీ చేసింది. సెలవులో ఉన్న వారికి ఉద్యోగ బాధ్యతలకు సంబంధించి ఎటువంటి సమాచారం అందకుండా చూడాలని కూడా ఆర్‌బీఐ తెలిపింది. అయితే..బ్యాంకుల అంతర్గత వ్యవహారాలు, ఇతర కార్పొరేట్ ఈ-మెయిళ్లకు మటుకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చింది. ఈ ఆదేశాలు అన్ని బ్యాంకులకు వర్తిస్తాయని, ఈ సర్క్యులర్ అందిన ఆరు నెలలలోగా బ్యాంకు మేనేజ్‌మెంట్ ఈ నిబంధనలను అమలు చేయాలని ఆర్‌బీఐ ఆదేశించింది. 

Updated Date - 2021-07-11T01:34:35+05:30 IST