మారిన బ్యాంకింగ్ రూల్స్.. ఎన్నారైలు ఈ విషయాన్ని తప్పనిసరిగా తెలుసుకోవాలి..!

Oct 10 2021 @ 19:13PM

ఇంటర్నెట్ డెస్క్: సాంకేతికత అభివృద్ధి చెందుతున్న కొద్దీ ఆన్‌లైన్ మోసాలు కూడా కొత్త రూపాలను సంతరించుకుంటున్నాయి. వినియోగదారులు ఊహించని రీతుల్లో వీటి బారిన పడుతున్నారు. ఈ క్రమంలో భారత రిజర్వ్ చెల్లింపులకు సంబంధించి ఈ-మాండేట్ పేరిట..కొత్త మార్గదర్శకాలను ప్రవేశ పెట్టింది. అక్టోబర్ ఒకటో తారీఖు నుంచీ ఈ విధానం అమల్లోకి వచ్చింది. భారత్‌లో బ్యాంక్ అకౌంట్లు, క్రెడిట్, డెబిట్ కార్డులు ఉన్న ఎన్నారైలు ఈ కొత్త మార్గదర్శకాలకు సంబంధించి తెలుసుకోవాల్సిన కీలక విషయాలు ఏంటంటే..

ఈ-మాండేట్ ప్రకారం.. క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా రూ. 5వేల కంటే అధికంగా రికరింగ్ చెల్లింపులు జరిపే సందర్భాల్లో ఈ నిబంధనలు వర్తిస్తాయి. వీటి ప్రకారం.. చెల్లింపులకు అనుమతి కోరుతూ బ్యాంకులు ప్రతిసారీ తమ కస్టమర్లకు 24 గంటల ముందుగానే ముందస్తు సూచనగా ఎస్‌ఎమ్మెస్‌లు పంపిస్తాయి. ఈ క్రమంలో అందే వన్ టైమ్ పాస్‌వర్డ్‌ను వినియోగదారులు బ్యాంకుతో పంచుకోవడం ద్వారా  చెల్లింపు జరిపేందుకు అనుమతినివ్వాలి. ఈ పాస్‌వర్డ్ షేర్ చేయని పక్షంలో చెల్లింపులు ఆగిపోయే ప్రమాదం ఉంది. అయితే.. క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా చేసే చెల్లింపుల విషయంలో మాత్రమే ఈ నిబంధనలు వర్తించనున్నాయి. అకౌంట్ల ద్వారా నేరుగా చెల్లింపుల జరిపితే కొత్త నిబంధన ప్రభావం ఏదీ ఉండదని సమాచారం. 

Follow Us on:

తాజా వార్తలుమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.