Bank Accounts: అన్నాడీఎంకే ఖాతాలు స్తంభింపజేయండి

ABN , First Publish Date - 2022-07-24T13:28:08+05:30 IST

అన్నాడీఎంకేకు చెందిన ఏడు బ్యాంకు ఖాతాలను(Bank Accounts) స్తంభింపజేయాలని మాజీ సీఎం ఒ. పన్నీర్‌సెల్వం రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా

Bank Accounts: అన్నాడీఎంకే ఖాతాలు స్తంభింపజేయండి

                                  - ఆర్బీఐకి ఓపీఎస్‌ లేఖ


చెన్నై, జూలై 23 (ఆంధ్రజ్యోతి): అన్నాడీఎంకేకు చెందిన ఏడు బ్యాంకు ఖాతాలను(Bank Accounts) స్తంభింపజేయాలని మాజీ సీఎం ఒ. పన్నీర్‌సెల్వం రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అధికారులకు ఓ లేఖ రాశారు. పార్టీ కోశాధికారిగా తానింకా కొనసాగుతున్నానని, తన అనుమతి లేకుండా పార్టీ ఖాతాలు కలిగిన కరూరు వైశ్యాబ్యాంక్‌ నిర్వాహకులు మాజీ సీఎం(Ex Cm) ఈపీఎస్‌ వర్గానికి ఆ ఖాతాలను నిర్వర్తించే అధికారం కల్పించారని ఆయన ఆరోపించారు. పార్టీ సమన్వయకర్త, కోశాధికారిగా పార్టీ(Party) బ్యాంక్‌ ఖాతాలను తానే నిర్వర్తిస్తూ వచ్చానని తెలిపారు. ప్రస్తుతం అన్నాడీఎంకేకు కరూరు వైశ్యాబ్యాంక్‌, ఇండియన్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా శాఖల్లో ఏడు ఖాతాలు ఉన్నాయన్నారు. ఈ నెల 11న పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఈపీఎస్‌ ఎంపిక కావడం చట్టవ్యతిరేకమని తాను న్యాయస్థానంలో కేసు వేశానని, ఈ పరిస్థితుల్లో బ్యాంక్‌(Bank) అధికారులు తన ప్రత్యర్థి వర్గానికే ఖాతాల నిర్వహణ బాధ్యతలు అప్పగించటం గర్హనీయమన్నారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఆ ఏడు బ్యాంక్‌ ఖాతాలను స్తంభింపజేస్తూ ఆదేశాలివ్వాలని ఓపీఎస్‌(Ops) ఆ లేఖలో కోరారు.

Updated Date - 2022-07-24T13:28:08+05:30 IST