డిజిటల్ కరెన్సీ... RBI కసరత్తు

Published: Fri, 27 May 2022 20:52:55 ISTfb-iconwhatsapp-icontwitter-icon
డిజిటల్ కరెన్సీ... RBI కసరత్తు

ముంబై : డిజిటల్ కరెన్సీ ప్రవేశపెట్టినపక్షంలో... ఒనగూరే లాభనష్టాల విషయమై RBI(Reserve Bank of India) కసరత్తు చేస్తోంది. దేశంలో డిజిటల్ రూపాయిని ప్రవేశపెట్టడం వల్ల కలిగే లాభనష్టాలను పరిశీలిస్తున్నామని ఆర్‌బీఐ శుక్రవారం వెల్లడించింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2022-23 బడ్జెట్‌ను సమర్పించే క్రమంలో... సెంట్రల్ బ్యాంక్ భారతీయ డిజిటల్ కరెన్సీని విడుదల చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. CBDC(సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ) అంశం 2022-23 యూనియన్ బడ్జెట్‌లో ప్రకటించిన విషయం తెలిసిందే.  ఆర్‌బీఐ చట్టం, 1934కి తగిన సవరణను ఫైనాన్స్ బిల్లు, 2022లో చేర్చినట్లు ఆర్‌బీఐ శుక్రవారం విడుదల చేసిన 2021-22 వార్షిక నివేదికలో పేర్కొంది. ఫైనాన్స్ బిల్లు, 2022, CBDC ప్రారంభించేందుకు ఓ చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్‌ను అందిస్తూ రూపుదిద్దుకున్న విషయం తెలిసిందే. ‘భారత్‌లో సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీని ప్రవేశపెట్టడంలో రిజర్వ్ బ్యాంక్ నిమగ్నమై ఉంది. CBDC రూపకల్పన ద్రవ్య విధానం, ఆర్థిక స్థిరత్వం, కరెన్సీ, చెల్లింపు వ్యవస్థల సమర్థవంతమైన కార్యకలాపాలకు సంబంధించి పేర్కొన్న లక్ష్యాలకు అణుగుణంగా ఉండాలి’ అని ఈ ఫ్రేంవర్క్  పేర్కొంది. భారత్‌లో CBDCని ప్రవేశపెట్టడం వల్ల కలిగే లాభనష్టాలను RBI పరిశీలిస్తోంది, ఇది CBDCని ప్రవేశపెట్టడానికి గ్రేడెడ్ విధానాన్ని అవలంబించాలని ప్రతిపాదిస్తోంది. కాగా... ఒకవేళ డిజిటల్ కరెన్సీ రూపుదిద్దుకున్నపక్షంలో... దీనిని ప్రయోగ దశల ద్వారా దశలవారీగా అమల్లోకి తేనున్నట్లు RBI వర్గాలు చెబుతున్నాయి. అంతరాయాలు లేకుండా అమలు చేయగలగడమన్న ప్రధానోద్దేశంతో ప్రతిపాదనలు లు పరిశీలనలో ఉన్నాయని సంబంధిత నివేదిక పేర్కొంది. ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రకటన తర్వాత, ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మాట్లాడుతూ... ‘రిజర్వ్ బ్యాంక్ తొందరపడరాదని, సీబీడీసీని ప్రవేశపెట్టే ముందు అన్ని అంశాలను జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంది’ అని పేర్కొన్నారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.