RBI వడ్డీ రేట్లు... ప్రీ-పాండమిక్ స్థాయికి ?

ABN , First Publish Date - 2022-05-16T20:43:32+05:30 IST

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా నెలకొన్న అధిక ద్రవ్యోల్బణం నేపథ్యంలో... ఆగస్టు నాటికి RBI వడ్డీ రేట్లు పెరగనున్నట్లు వినవస్తోంది.

RBI వడ్డీ రేట్లు...  ప్రీ-పాండమిక్ స్థాయికి ?

* ద్రవ్యోల్బణ ఒత్తిడికి RBI కారణం కాదు... నివేదిక 

ముంబై : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా నెలకొన్న అధిక ద్రవ్యోల్బణం నేపథ్యంలో... ఆగస్టు నాటికి RBI వడ్డీ రేట్లు పెరగనున్నట్లు వినవస్తోంది. ఈ రేట్లు... ప్రీ-పాండమిక్ స్థాయికి పెంచవచ్చునని అంచనా. ద్రవ్యోల్బణంలో నిరంతర పెరుగుదల నేపథ్యంలో... RBI... జూన్-ఆగస్టు పాలసీలో రేట్లు పెంచుతుందని, ఆగస్టు నాటికి 5.15 % తో ప్రీ-పాండమిక్ స్థాయికి తీసుకువెళుతుందని SBI Ecowrap పేర్కొంది.


US వంటి అధునాతన ఆర్థిక వ్యవస్థల మాదిరిగా కాకుండా, భారతదేశంలో ద్రవ్యోల్బణం మోడరేట్ చేయడానికి సమయం పట్టవచ్చునని SBI Ecowrap చెబుతోంది. SBI పరిశోధన నివేదిక ప్రకారం...  రాబోయే ద్రవ్య విధాన సమావేశాల్లో RBI... అనివార్యంగా వడ్డీ రేట్లను పెంచనుంది. అంతేకాకుండా... ద్రవ్యోల్బణం కారణంగా ఆగస్టు నాటికి 5.15 శాతం ప్రీ-పాండమిక్ స్థాయిల వరకు రేట్లను తీసుకెళ్ళొచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో ఆహార ధరలు, పట్టణ ప్రాంతాల్లో ఇంధన ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. ఈ ద్రవ్యోల్బణం... ప్రత్యేకించి... రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో... సరఫరా వ్యవస్థపై ఒత్తిడి తెచ్చిందని, ఈ క్రమంలో... ద్రవ్యోల్బణ ఒత్తిడికి RBI ని నిందించడం వ్యర్థమని నివేదిక పేర్కొంది.


‘ఫిబ్రవరిని బేస్ కేస్‌గా(ఉక్రెయిన్-రష్యా యుద్ధం ప్రారంభ సమయం) ప్రాతిపదికన... ఈ అధ్యయనం తాజా వివరాలను  వెల్లడించింది. ప్రత్యేకంగా ఎఫ్‌ఎంసీజీ రంగంపై ఇన్‌పుట్ ఖర్చుల ప్రభావాన్ని కూడా కలిపినపక్షంలో... వ్యక్తిగత సంరక్షణ, ప్రభావాల సహకారాన్ని జోడిస్తే... దేశ స్థాయిలో మొత్తం ప్రభావం 59% కు చేరుతుందని సోమవారం ప్రచురించిన ఎస్‌బీఐ ఎకోవ్రాప్ పేర్కొంది. 

కాగా... యుద్ధ సంబంధిత అంతరాయాల నుండి త్వరగా కోలుకోనిపక్షంలో... ద్రవ్యోల్బణం అర్థవంతంగా తగ్గుతుందా ? లేదా ? అన్నది సెంట్రల్ బ్యాంక్ ఎదుర్కొంటున్న ప్రధాన సవాలుగా మిగిలిపోయిందన్న వ్యాఖ్యానాలు సంబంధిత వర్గాల నుంచి వినవస్తున్నట్లు SBI చీఫ్ ఎకనామిస్ట్ సౌమ్య కాంతి ఘోష్... తన SBI Ecowrapలో పేర్కొన్నారు. కాగా... US వంటి అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల మాదిరిగా కాకుండా, భారతదేశంలో ద్రవ్యోల్బణం మోడరేట్ కావడానికి సమయం పట్టవచ్చునన్న అభిప్రాయాలున్నాయి. భారతదేశంలోని ద్రవ్యోల్బణం పరిస్థితి  ఇతర దేశాల కంటే భిన్నంగా ఉందని నివేదిక పేర్కొంది. అమెరికా తదితర దేశాల్లో... ద్రవ్యోల్బణం 40 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరుకున్నప్పటికీ, వేతన పెరుగుదలపై కూడా ఒత్తిడి పెరగడం గమనార్హం. కాగా... వేతనాల పెరుగుదల తక్కువగా ఉండడం గమనార్హం. ఇది ఒక హెచ్చరిక వంటిదేనని, ఈ క్రమంలో...   భారతదేశంలో ద్రవ్యోల్బణం మోస్తరు స్థితికి చేరడానికి సమయం పడుతుందని SBI రీసెర్చ్ పేర్కొంది. ఏప్రిల్‌లో వినియోగదారుల ధరల సూచీ(CPI) ద్రవ్యోల్బణం 7.8 శాతానికి పెరిగిన విషయం తెలిసిందే. ఇది ఎనిమిదేళ్ల గరిష్ట స్థాయితో పాటు విశ్లేషకుల అంచనాల కంటే ఎక్కువగా ఉంది.

Updated Date - 2022-05-16T20:43:32+05:30 IST