భారత్‌లో Digital currency.. RBI Deputy governor కీలక ప్రకటన

ABN , First Publish Date - 2021-07-23T03:10:16+05:30 IST

భారత్‌లో డిజిటల్ కరెన్సీలను దశల వారీగా ప్రవేశపెట్టాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) భావిస్తున్నట్టు బ్యాంకు డిప్యుటీ గవర్నర్ టీ. రవి శంకర్ గురువారం తెలిపారు.

భారత్‌లో Digital currency.. RBI Deputy governor కీలక ప్రకటన

ముంబై: భారత్‌లో డిజిటల్ కరెన్సీలను దశల వారీగా ప్రవేశపెట్టాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) భావిస్తున్నట్టు బ్యాంకు డిప్యూటీ గవర్నర్ టీ. రవి శంకర్ గురువారం తెలిపారు. ఈ క్రమంలో ముందుగా ఈ కరెన్సీని పరిమితస్థాయిలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెడతామని కూడా ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం హామీగా ఉండే డిజిటల్ కరెన్సీలు, ప్రజల్ని ప్రైవేటు డిజిటల్ కరెన్సీల ఒడిదుడుకుల నుంచి రక్షిస్తాయని చెప్పారు.  వివిధ దేశాల కేంద్రీయ బ్యాంకులు ప్రస్తుతం డిజిటల్ కరెన్సీలపై దృష్టి సారిస్తున్నాయి. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ ఇప్పటికే ప్రయోగత్మకంగా ఓ డిజిటల్ కరెన్సీని ప్రవేశపెట్టింది. చైనా కూడా పలు నగరాల్లో డిజిటల్ కరెన్సీలను దాని తీరుతెన్నులను నిశితంగా పరిశీలిస్తోంది. క్రిప్టోకరెన్సీలకు ప్రస్తుతం విపరీతంగా డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే. 

Updated Date - 2021-07-23T03:10:16+05:30 IST