ఆర్‌బీఐ రూల్స్‌ అమలు చేయాలి

Sep 17 2021 @ 23:13PM
ఆర్‌బీఐ సర్క్యులర్‌ను బ్యాంకు ప్రతినిధులకు వివరిస్తున్న జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ రిసోర్స్‌ పర్సన్‌ సురేశ్‌ కుమార్‌

- ఆర్బీఐ సర్క్యులర్‌ ప్రకారం ఫైనాన్స్‌ జరగడం లేదు

- జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ రిసోర్స్‌ పర్సన్‌ సురేశ్‌ కుమార్‌

- రుణవితరణ, రికవరీపై డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో సమీక్ష


మహబూబ్‌నగర్‌ (కలెక్టరేట్‌), సెప్టెంబరు 17 : స్వయం సహాయక మహి ళా సంఘాల సభ్యులకు రుణాలు ఇవ్వడంలో ఆర్బీఐ నిబంధనలు తప్పక అమలు చేయాల్సిందేనని జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ రిసోర్స్‌ పర్సన్‌ సురేశ్‌ కుమార్‌ స్పష్టం చేశారు. మహిళా సంఘాల సభ్యులకు ఇస్తున్న బ్యాంక్‌ లింకేజీ రుణాలు, వాటి రికవరీపై శుక్రవారం రెవెన్యూ సమావేశ మందిరంలో డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్‌బీఐ విడుదల చేసిన సర్క్యులర్‌ను బ్యాంకర్లకు ఆయన వివరించారు. గ్రా మీణ బ్యాంకుల ద్వారా రూ.10 లక్షలు, కమర్షియల్‌ బ్యాంకుల ద్వారా రూ. 20 లక్షలు చొప్పున మహిళా సంఘాలకు రుణాలను అందజేయాలని సూచించా రు. అంత ఫైనాన్స్‌ ఏ బ్యాంకులోనూ జరగడం లేదని పేర్కొన్నారు. ఎలాంటి సెక్యూరిటీ లేకుండా ఈ రుణాలు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకుంటున్న స్వయం సహాయక సంఘాల సభ్యులు తప్పని సరిగా జీవనోపాధులు ఏర్పాటు చేసుకునేలా బ్యాంకర్లు, గ్రామ సంఘాలు, మండల మహిళా సమాఖ్యలు, జిల్లా స్థాయిలో డీఆర్‌డీఏ సంబంధిత అధికా రులు సమన్వయంతో పని చేయాలిని సూచించారు. రుణవితరణ, రికవరీలు వేగవంతం చేయాలని వివరించారు. అనంతరం సెర్ప్‌ నుంచి ప్రాజెక్ట్‌ మేనేజర్‌ జయంతి, ప్రాజెక్ట్‌ ఎగ్జిక్యూటివ్‌ వెంకట్‌ మాట్లాడుతూ లోన్‌ ప్రపోజల్స్‌కు బ్యాం కర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, షరతుల గురించి వివరించారు. కార్యక్రమంలో డీఆర్‌డీవో యాదయ్య, ఏపీడీ శారద, డీపీఎం బ్యాంక్‌ లింకేజీ సలోమి, డీపీఎం ఐబి నాగమల్లిక, ఎల్‌డీఎం లు మహబూబ్‌నగర్‌ నాగరాజు, నారాయణపేట్‌ ప్రసన్న కుమార్‌, మహబూబ్‌ నగర్‌ జిల్లా నుంచి 21, నారాయణపేట జిల్లా నుంచి 21 బ్యాంకర్ల ప్రతి నిధులు, బ్యాంక్‌ లింకేజీ డీపీఎంలు, ఏపీఎంలు, స్వయం సహాయక మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Follow Us on: