ఫారెక్స్ ఇన్ఫ్లోలను పెంచుకునే దిశగా RBI
ABN , First Publish Date - 2022-07-06T23:47:27+05:30 IST
విదేశీ మారకద్రవ్యం పెంచుకునే దిశగా చర్యలు తీసుకుంటామని RBI(రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) వెల్లడించింది.
ముంబై : విదేశీ మారకద్రవ్యం పెంచుకునే దిశగా చర్యలు తీసుకుంటామని RBI(రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) వెల్లడించింది. ఈ క్రమంలో... విదేశీ పెట్టుబడిదారులను స్వల్పకాలిక కార్పొరేట్ రుణాలలో పెట్టుబడి పెట్టడానికి అనుమతించడం సహా పూర్తిగా అందుబాటులో ఉన్న మార్గాల్లో మరిన్ని ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలు చేయడానికి అనుమతించడం వంటి చర్యలుంటాయని వెల్లడించింది. విదేశీ మారకద్రవ్యం మార్కెట్లో లిక్విడిటీ పరిస్థితులను పర్యవేక్షిస్తున్నామని, క్రమబద్ధమైన మార్కెట్ పనితీరును నిర్ధారించే లక్ష్యంతో డాలర్ విలువను తగ్గించేందుకు అవసరమైన దిశలో అడుగులు వేస్తున్నామని RBI పేర్కొంది.