ఆర్బీకేల ద్వారా రైతులకు సేవలు

ABN , First Publish Date - 2022-08-13T06:04:42+05:30 IST

ఆర్బీకేల ద్వారా రైతుల కు సాగుకు అవసరమయ్యే సేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు ప్రిన్సిపల్‌ సెక్రటరి పూనం మాలకొండ య్య తెలిపారు.

ఆర్బీకేల ద్వారా రైతులకు సేవలు
వెల్లలూరు ఆర్బీకేలో అధికారులతో పూనం మాలకొండయ్య

వెల్లలూరు ఆర్బీకేను తనిఖీ చేసిన పూనం మాలకొండయ్య

పొన్నూరుటౌన్‌, ఆగస్టు 12: ఆర్బీకేల ద్వారా రైతుల కు సాగుకు అవసరమయ్యే సేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు ప్రిన్సిపల్‌ సెక్రటరి పూనం మాలకొండ య్య తెలిపారు. మండలంలోని వెల్లలూరు ఆర్బీకేను శుక్రవారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడారు. అనంతరం ఆమె మాట్లాడుతూ నాణ్యమైన విత్తనాలు, పురుగు మందులను సరఫరా చేయాలని రైతులు కోరినట్లు చెప్పారు. దీనిపై ఇప్పటికే ప్రభుత్వం ఏపీ ఆగ్రోస్‌ ద్వారా ఉత్తమ కంపెనీలతో చర్చలు జరిపినట్లు చెప్పారు. రానున్న నెల రోజుల్లో ఎరువులు, పురుగు మందులు సరఫరా చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఫిర్యాదుల నేపథ్యంలో రైతుకు సంబంధం లేకుండా మిల్లర్‌ కు ధాన్యం సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. గ్రామం యూనిట్‌గా పంట కోత ప్రయోగం వల్ల పరిహారం అందక నష్టపోతున్న ట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. దీనిపై పునరాలోచించి నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు. ప్రతి రైతు తప్పనిసరిగా పంట నమోదు చేయించుకుని రశీదు పొందాలన్నారు. కార్యక్రమంలో అగ్రికల్చర్‌ కమిషనర్‌ హరికిరణ్‌, సీడ్‌ కార్పొరేషన్‌ డీఎం ప్రసాద్‌, ఆర్బీకే  జేడీ శ్రీధర్‌, జిల్లా డీఏవో నున్నా వెంకటేశ్వర్లు, స్థానిక ఏడీఏ సీహెచ్‌ తిరుమలాదేవి, డీఎస్‌వో బి.గోపాల్‌, చీఫ్‌ ప్లానింగ్‌ ఆఫీసర్‌ పి.శేషశ్రీ, జేడీఏ ఎన్‌.వెంకటేశ్వర్లు, ఏపీసీడ్స్‌ ఎండీ శేఖర్‌బాబు పాల్గొన్నారు.


Updated Date - 2022-08-13T06:04:42+05:30 IST