'RC 15': శంకర్ - చరణ్ సినిమాలో జయరామ్..?

Aug 27 2021 @ 08:40AM

క్రియేటివ్ జీనియస్ శంకర్ - మెగా పవర్ స్టార్ రాం చరణ్ కాంబినేషన్‌లో ఓ పాన్ ఇండియా సినిమా మొదలవబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రముఖ మలయాళ నటుడు జయరామ్ కీలక పాత్రకి ఎంపికైనట్టు సమాచారం. 'ఆర్ఆర్ఆర్', 'ఆచార్య' సినిమాలు చేస్తున్న చరణ్, తన 15వ సినిమాగా శంకర్ దర్శకత్వంలో నటించబోతున్నాడు. క్రేజీ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ చరణ్ సరసన నటిస్తోంది. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందించబోతున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు - శిరీష్ కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతోంది. ఇందులో భాగంగానే నటీ నటులను ఎంచుకునే పనిలో ఉందట చిత్రబృందం. ఈ క్రమంలోనే ఓ నెగిటివ్ రోల్ కోసం జయరామ్ ను తీసుకున్నట్టు తెలుస్తోంది. జయరామ్ ఇప్పటికే త్రివిక్రం - అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వచ్చిన 'అల వైకుంఠపురములో' ఓ ముఖ్య పాత్ర పోషించి ఆకట్టుకున్నారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.