వికెట్ పడకుండానే.. ఆర్సీబీ విక్టరీ

ABN , First Publish Date - 2021-04-23T04:28:09+05:30 IST

రాజస్థాన్ రాయల్స్‌పై ఆర్సీబీ అదిరిపోయే వికె్టరీ సాధించింది. ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 178 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఆర్సీబీ ఓపెనర్లు ..

వికెట్ పడకుండానే.. ఆర్సీబీ విక్టరీ

ముంబై: రాజస్థాన్ రాయల్స్‌పై ఆర్సీబీ అదిరిపోయే విక్టరీ సాధించింది. ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 178 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఆర్సీబీ ఓపెనర్లు దేవ్‌దత్ పడిక్కల్(101: 52 బంతుల్లో.. 11 ఫోర్లు, 6 సిక్స్‌‌లు) సెంచరీతో కదం తొక్కగా.. ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(72: 47బంతుల్లో.. 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్థ సెంచరీతో మెరిశాడు. దీంతో ఇప్పటివరకు ఈ సీజన్లో తొలిసారిగా ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా విజయం సాధించిన ఏకైక జట్టుగా ఆర్సీబీ రికార్డు సృష్టించింది. అలాగే మరో 21 బంతులు మిగిలుండగానే.. లక్ష్యాన్ని ఛేదించింది. 16.3 ఓవర్లలో 181 పరుగులు చేసి అద్భుత విజయాన్ని కైవసం చేసుకుంది. మ్యాన్  ఆఫ్ ది మ్యాచ్ పడిక్కల్‌కు దక్కింది.


 ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీతో పాటు మరో ఓపెనర్ పడిక్కల్ ఐపీఎల్‌లో అరుదైన రికార్డులు సొంతం చేసుకున్నారు. ఐపీఎల్ చరిత్రలో 6000 పరుగులు పూర్తి చేసిన తొలి ఆటగాడిగా కోహ్లీ రికార్డు నెలకొల్పగా.. అన్‌క్యాప్డ్ ఆటగాళ్లలో అతి తక్కువ బంతుల్లో సెంచరీ సాదించిన ఆటగాడిగా పడిక్కల్ ఘనత సాధించాడు. కాగా.. రాజస్థాన్ బౌలర్లలో ఎవ్వరికీ ఒక్క వికెట్ కూడా దక్కలేదు. ఈ విజయంతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌ను నిలబెట్టుకోవడమే కాకుండా.. ఆడిన నాలుగు మ్యాచ్‌లలో నాలుగూ గెలిచి టాప్ జట్టని మరోసారి రుజువు చేసుకుంది.

Updated Date - 2021-04-23T04:28:09+05:30 IST