ఏరియా వైద్యశాల డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నారు

Published: Mon, 27 Jun 2022 21:59:47 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఏరియా వైద్యశాల డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నారు ఆర్డీవోకు సమస్యలు వివరిస్తున్న దళిత సంఘర్షణ సమితి బాధ్యులు

ఆర్డీవోకి దళిత సంఘర్షణ సమితి నేతల ఫిర్యాదు

కావలిటౌన్‌, జూన్‌ 27: కావలి ప్రభుత్వ ఏరియా వైద్యశాల వైద్యులు ప్రతి కేసును నెల్లూరు పెద్దాసుపత్రికి సిఫార్సు చేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని దళిళ సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు ఎస్‌ మల్లి ఆర్డీవో శీనానాయక్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సోమవారం వినతిపత్రం అందజేసి మాట్లాడుతూ ఏరియా వైద్యశాలలో పేద ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించడం లేదన్నారు. ప్రైవేట్‌ ఆసుపత్రులకు పోలేని పేదలు ఏరియా వైద్యశాలలకు వస్తే వైద్యం అందించకుండా నెల్లూరుకు సిఫార్సు చేస్తున్నారని,  పేరాసెట్మాల్‌ మాత్రలు తప్పితే మందులు లేవని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సమితి సభ్యులు జె విజయరత్నం, ఎన్‌ లక్ష్మీనర్సు, బ్రహ్మయ్య, మాల్యాద్రి, కొండమ్మ, మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.