వివేక్‌పై దాడి చేసిన వ్యక్తులను అరెస్టు చేయాలి

ABN , First Publish Date - 2021-04-18T06:07:47+05:30 IST

గుడ్‌మెన్‌పేటకు చెందిన మూర్తా వివేక్‌పై దాడి చేసి ప్రాణపాయస్థితికి తెచ్చిన వ్యక్తులను తక్షణం అరెస్టు చేయాలంటూ వివేక్‌ బంధువులు దళిత నాయకులు శనివారం ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.

వివేక్‌పై దాడి చేసిన వ్యక్తులను అరెస్టు చేయాలి
ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న దళిత నాయకులు

ఆర్డీవో కార్యాలయం వద్ద దళిత నాయకుల ధర్నా

గుడివాడ టౌన్‌, ఏప్రిల్‌ 17 : గుడ్‌మెన్‌పేటకు చెందిన మూర్తా వివేక్‌పై దాడి చేసి ప్రాణపాయస్థితికి తెచ్చిన వ్యక్తులను తక్షణం అరెస్టు చేయాలంటూ వివేక్‌ బంధువులు దళిత నాయకులు శనివారం ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. వివేక్‌పై దాడి చేసిన వ్యక్తులను వదిలి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వివేక్‌పై పోలీసులు కేసు నమోదు చేయడానికి ప్రయత్నించడం దారుణమన్నారు. ఈ సందర్భంగా వివేక్‌ మేనత్త కొనగంటి మేరి, దళిత నాయకులు వేశపోగు మోహన్‌, మామిళ్ళ ఎలీషా, బలసాని మోహన్‌ మాట్లాడుతూ రైతు బజారు వద్ద వివేక్‌ పండ్లు అమ్ముకుని జీవిస్తాడన్నారు. రైతు బజారుకు చెందిన పులపా మహేష్‌, బత్తుల మురళీ, బంటి, ఆనంద్‌ తదితరులు గత నెల 24వ తేదీన వివేక్‌పై రాడ్డుతో దాడి చేసి తీవ్రంగా గాయపర్చారన్నారు. పోలీసులు దాడి చేసిన వ్యక్తులను వదిలేసి ఆసుపత్రిలో చికిత్స పొంది ఇంటికి వచ్చిన బాధితుడిని టూటౌన్‌ పోలీసులు అరెస్టు చేయాలని ప్రయత్నించడం దారుణమన్నారు.  దీనిపై  టూటౌన్‌ సీఐని కలిసి వివరించగా గుడ్‌మెన్‌పేట కేసులు తీసుకోనని ఖరాఖండిగా చెప్పారని వివేక్‌ మేనత్త మేరి వాపోయారు. వివేక్‌పై దాడి చేసిన వారి వద్ద లంచం తీసుకుని బాధితుడిపై కేసు నమోదు చేయాలని పోలీసులు చూస్తున్నారని తమకు న్యాయం చేయాలంటూ ఆర్డీవోకు వినతి పత్రం అందజేశారు.ఏసుపోగు ఏసయ్య, ఎం.జా్‌బాబు, కాశమ్మ, చిన్నమ్మ, సునీత, సువార్తమ్మ తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2021-04-18T06:07:47+05:30 IST