రీ సర్వే పనులు వేగవంతం : కలెక్టర్‌

Published: Wed, 06 Jul 2022 01:44:37 ISTfb-iconwhatsapp-icontwitter-icon
రీ సర్వే పనులు వేగవంతం : కలెక్టర్‌ సమావేశంలో కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌

కాకినాడ సిటీ, జూలై 5: జిల్లాలో జగనన్న భూహక్కు, భూ రక్షా కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న రీసర్వే పనులు వేగవంతం చేయాలని కలెక్టర్‌ కృతికాశుక్లా అధి కారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో జేసీ ఇలాక్కియా, రెవెన్యూ, సర్వేశాఖల అధికారులతో కలిసి కలెక్టర్‌తోపాటు సర్వే పనులను సమీక్షించారు. ఈ సంద ర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సర్వే ఆఫ్‌ ఇండియా సహ కారంతో జరుగుతున్న ఈ పనులు సకాలంలో పూర్తి చేయాలన్నారు. కాకినాడ డివిజన్‌ డ్రోన్‌ సర్వే పనులు ఈ నెలాఖరు నాటికి, పెద్దాపురం డివిజన్‌ సర్వే పనులు అక్టోబరు చివరికి పూర్తి చేయాలని కలెక్టర్‌ తెలిపారు. ఈ సమావేశంలో సర్వే ఏడీ బి లక్ష్మీనారాయణ, కాకినాడ, పెద్దాపురం ఆర్డీవోలు బీవీ రమణ, జె సీతారామారావు, పెద్దాపురం డీఐవోఏఎస్‌ ఎం జ్యోషిల పాల్గొన్నారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.