HYD: ‘ఆల్‌కి మెటల్‌’లో పేలిన రియాక్టర్‌

ABN , First Publish Date - 2021-10-27T17:30:49+05:30 IST

HYD: ‘ఆల్‌కి మెటల్‌’లో పేలిన రియాక్టర్‌

HYD: ‘ఆల్‌కి మెటల్‌’లో పేలిన రియాక్టర్‌

ఇద్దరు కార్మికులకు గాయాలు

హైదరాబాద్/దుండిగల్‌: డిపోచంపల్లి గ్రామం, సారెగూడెం ప్రాంతంలో ఉన్న ఆల్‌కి మెటల్‌ బాలాజీ కంపెనీలో మంగళవారం ఉదయం రియాక్టర్‌ పేలి ఇద్దరు కార్మికులు గాయపడ్డారు. సారెగూడానికి చెందిన సూరారం మహేష్‌, డిపోచంపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్‌ పదేళ్లుగా కంపెనీలో పనిచేస్తున్నారు. రియాక్టర్‌ పేలుడులో గాయపడిన వీరిని యాజమాన్యం బాలానగర్‌లోని బీబీఆర్‌ ఆస్పత్రికి తరలించింది. ఈ ఘటనను పోలీసులకు తెలియకుండా గోప్యంగా ఉంచారు. తమకు ఫిర్యాదు అందలేదని దుండిగల్‌ సీఐ రమణారెడ్డి తెలిపారు. 

Updated Date - 2021-10-27T17:30:49+05:30 IST