చదువు, జ్ఞానంతోనే భవిత

ABN , First Publish Date - 2021-03-01T04:49:23+05:30 IST

చదువుతో జ్ఞానాన్ని ఆర్జించి ఉన్నత శిఖరాలకు ఎదగడమే ల క్ష్యంగా ముందుకు సాగాలని సాంఘిక సంక్షేమ శాఖ గురుకులాల రాష్ట్ర కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ అన్నారు.

చదువు, జ్ఞానంతోనే భవిత
కేసీఆర్‌ స్టడీ సర్కిల్‌లో మాట్లాడుతున్న ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌

 - సాంఘిక సంక్షేమ శాఖ గురుకులాల రాష్ట్ర కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌

గద్వాల, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి) : చదువుతో జ్ఞానాన్ని ఆర్జించి ఉన్నత శిఖరాలకు ఎదగడమే ల క్ష్యంగా ముందుకు సాగాలని సాంఘిక సంక్షేమ శాఖ గురుకులాల రాష్ట్ర కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ అన్నారు. గద్వాల పట్టణంలోని కేసీఆర్‌ స్టడీ సర్కిల్‌ను ఆదివారం ఆయన సందర్శించారు. బీఈడీ, టెట్‌లకు శిక్షణ పొందుతున్న అభ్యర్థులతో మాట్లాడారు. కష్టపడి చదివితే ఉద్యోగంతో పాటు గుర్తింపు వస్తుందన్నారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్‌ స్టడీ సర్కిల్‌ను సద్వినియోగం చేసుకొని భవిష్యత్‌ లక్ష్యాలను సాధించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గట్టు ఎంపీపీ విజయకుమార్‌, గద్వాల వ్యవసాయ మా ర్కెట్‌ చైర్‌పర్సన్‌ రామేశ్వరమ్మ పాల్గొన్నారు.

 గురుకుల డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి

గద్వాల టౌన్‌: జిల్లాలో గురుకుల డిగ్రీ కళాశా లను ఏర్పాటు చేయాలని గద్వాల వ్యవసా య మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రామేశ్వరమ్మ గురుకులాల రాష్ట్ర కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ను కో రారు. జిల్లా కేంద్రానికి ఆదివారం వచ్చిన ఆయ నను మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడారు. ఇటీ వల మూడు కొత్త జిల్లాల్లో గురుకుల డిగ్రీ కళాశా లను ఏర్పాటు చేశారని తెలిపారు. అదే విధంగా గద్వాలకూ కేటాయించి నిరుపేద విద్యార్థులకు ఉ న్నత విద్యావకాశాలు కల్పించాలని కోరారు. 

  గట్టు మండలాన్ని దత్తత తీసుకుంటా  

 గట్టు : గట్టు మండలాన్ని జ్ఞాన పరంగా దత్త త తీసుకుంటానని గురుకులాల రాష్ట్ర కార్యదర్శి   ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ ప్రకటించారు. ఆదివారం మండలపరిధిలోని తుమ్మలచెర్వు, ఆలూరు, సల్కాపురం గ్రామాలలో విలేజ్‌ లర్నింగ్‌ సర్కిల్స్‌ను ఆ యన ప్రారంభించారు.  కార్యక్రమంలో సౌత్‌జోన్‌ ప్రసిడెంట్‌  శ్రవణ్‌కుమార్‌, జిల్లా అధ్యక్షుడు శేష న్న, గట్టు మండల ఇన్‌చార్జి సుబ్బన్న, భాస్కర్‌, ప్రతాప్‌ స్వేరో సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు.  

ప్రవీణ్‌కుమార్‌ను అడ్డుకునేందుకు యత్నం

గద్వాలక్రైం: పట్టణంలోని కేసీఆర్‌ స్టడీ సర్కిల్‌లో ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతుండగా అడ్డుకు నేందుకు బీజేపీ నాయకులు అక్కడికి చేరుకున్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, నా యకులు గడ్డం కృష్ణారెడ్డి, బండల వెంకట్రాములు, రవికుమార్‌ ఎగ్బోటే, డీకే స్నిగ్ధారెడ్డి తదితరు లు స్టడీ సర్కిల్‌ లోనికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండ గా సీని యర్‌ ఐపీఎస్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అధికార పార్టీ నిర్వహిస్తున్న స్టడీ సర్కిల్‌ను ఎలా సందర్శి స్తారని ప్రశ్నించారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ యాదగిరి, సీఐ హనుమంతు వారికి నచ్చజెప్పి పంపించేశారు.

Updated Date - 2021-03-01T04:49:23+05:30 IST