ఇష్టంతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలి

ABN , First Publish Date - 2021-02-28T05:26:02+05:30 IST

ఇష్టంతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి విద్యార్థుల కు సూచించారు.

ఇష్టంతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలి
పాఠాలు బోధిస్తున్న ప్రభుత్వ విప్‌ సునీత

ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి 

యాదాద్రి రూరల్‌, ఫిబ్రవరి 27: ఇష్టంతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి విద్యార్థుల కు సూచించారు. మండలంలోని చిన్నకందుకూర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను శనివారం ఆమె సందర్శించారు. పదో తరగతి విద్యార్థులకు పాఠాలు బోధించారు. విద్యార్థుఽలు ఏకాగ్రతతో చదివి, ఉపాధ్యాయుల సూచనలు పాటించి పరీక్షలకు సిద్ధం కావాలన్నారు.  పాఠశాల ఆవరణలో సుమారు 60వేల నర్సరీ మొక్కలు ఎండిపోయి ఉండడంపై  ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతకుముందు చిన్నకందుకూర్‌లో నాయకులకు టీఆర్‌ఎస్‌ సభ్యత్వాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలేరు మార్కెట్‌ చైర్మన్‌ గడ్డమీది రవీందర్‌గౌడ్‌, కట్ట మల్లేశం, నర్సింహ్మగౌడ్‌ పాల్గొన్నారు.


Updated Date - 2021-02-28T05:26:02+05:30 IST