విద్యుత్‌బిల్లుల రీడింగ్‌కు ప్రత్యేక యాప్‌

ABN , First Publish Date - 2021-05-07T04:23:07+05:30 IST

కరోనా వ్యాప్తి నేపథ్యంలో మే నెలలో విద్యుత్‌ మీటరు రీడింగ్‌లు తీయడం సాధ్యమయ్యే పరిస్థితులు లేవు. దీంతో ఈ నెలలో వినియోగదారులు తమ బిల్లులను విద్యుత్తు శాఖ సూచించిన మొబైల్‌ యాప్‌ ద్వారా మీటరు రీడింగ్‌లను పంపాలని టీఎస్‌ ఎన్‌పీడీసీఎల్‌ ఉన్నతాధికారులు సూచిస్తున్నారు.

విద్యుత్‌బిల్లుల రీడింగ్‌కు ప్రత్యేక యాప్‌

కరోనా నేపథ్యంలో ఎన్‌పీడీసీఎల్‌ ఉన్నతాధికారుల నిర్ణయం

భద్రాచలం, మే 6: కరోనా వ్యాప్తి నేపథ్యంలో మే నెలలో విద్యుత్‌ మీటరు రీడింగ్‌లు తీయడం సాధ్యమయ్యే పరిస్థితులు లేవు. దీంతో ఈ నెలలో వినియోగదారులు తమ బిల్లులను విద్యుత్తు శాఖ సూచించిన మొబైల్‌ యాప్‌ ద్వారా మీటరు రీడింగ్‌లను పంపాలని టీఎస్‌ ఎన్‌పీడీసీఎల్‌ ఉన్నతాధికారులు సూచిస్తున్నారు.  ఈ మేరకు ఇప్పటికే వినియోగదారులకు ఈ యాప్‌ను తమ మొబైల్‌లో యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకొని రీడింగ్‌ను పంపాలని సూ చిస్తున్నారు. ఇందుకు సంబందించి టీఎస్‌ఎన్‌పీడీసీఎల్‌ సీఎండీ ఎ.గోపాల్‌రావు యాప్‌ను ఏ విదంగా డౌన్‌లోడు చేసుకోవాలి, ఏ విధంగా రీడింగ్‌ పంపాలి అనే అంశాలను వివరిస్తూ వివిధ జిల్లాల టీఎస్‌ ఎన్‌పీడీసీఎల్‌ ఎస్‌ఈలకు మార్గదర్శకాలను పంపారు. 

ఏ విధంగా రీడింగ్‌ పంపాలంటే..

గూగుల్‌ ప్లేస్టోర్‌లో టీఎస్‌ ఎన్‌పీడీసీఎల్‌ ఐటీ వింగ్‌ అనే యాప్‌, భారత్‌ సెల్ఫ్‌ మీటర్‌ రీడింగ్‌ అనే యాప్‌లను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. అనంతరం టీఎస్‌ఎన్‌పీడీసీఎల్‌ యాప్‌ ఓపెన్‌ చేసి అందులో సెల్ప్‌ రీడింగ్‌ను క్లిక్‌ చేసి అందులో సబ్‌మిట్‌ సెల్ప్‌ రీడింగ్‌ను ఎంచుకోవాలి. తరువాత వినియోగ దారుడుని యునిక్‌ సర్వీసు నెంబరును ఎంటర్‌ చేసి మొబైల్‌ నెంబరును ఎంటర్‌ చేసి స్కాన్‌ కేడబ్ల్యుహెచ్‌ను క్లిక్‌ చేసి విద్యుత్తు మీటరులో గల కేడబ్ల్యుహెచ్‌ రీడింగ్‌ను స్కాన్‌ చేసిన తరువాత సబ్‌మిట్‌ బటన్‌ క్లిక్‌ చేయాలి. నమోదైన బిల్లు వివరాలు ఆధారంగా  వినియోగదారుడి మొబైల్‌కు మేసెజ్‌ వస్తుంది. ఆ రీడింగ్‌ మేసెజ్‌ ద్వారా నమోదైన బిల్లును ఆన్‌లైన్‌లో చెల్లించాలి. సెల్ఫ్‌ మీటరు రీడింగు పద్ధతి ఈ నెలకు మాత్రమే వర్తిస్తుందని టీఎస్‌ ఎన్‌పీడీసీఎల్‌ సీఎండీ ఎ.గోపాల్‌రావు ఇప్పటికే స్పష్టం చేశారు. 


Updated Date - 2021-05-07T04:23:07+05:30 IST