టెన్త్‌ పరీక్షలకు రెడీ

ABN , First Publish Date - 2022-05-17T05:49:33+05:30 IST

కొవిడ్‌ నేపథ్యంలో రెండేళ్ల విరామం తర్వాత నిర్వహిస్తున్న పదో తరగతి పరీక్షలకు హనుమకొండ జిల్లా విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 23 నుంచి జూన్‌ 1 వరకు పరీక్షలు జరుగనున్నాయి. ఇది వరకు పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు పదకొండు పేపర్లు రాయాల్సి ఉండగా కరోనా కారణంగా ప్రత్యక్ష తరగతులు ఆలస్యంగా ప్రారంభం కావడంతో వాటి సంఖ్యను ఆరు పేపర్లకు కుదించారు.

టెన్త్‌ పరీక్షలకు రెడీ

ఈ నెల 23 నుంచి జూన్‌ 1వరకు నిర్వహణ
రెండేళ్ల తర్వాత ప్రత్యక్షంగా పరీక్షలు
71 పరీక్షా కేంద్రాలు... 12,507 మంది విద్యార్థులు
ఆరు పేపర్లకు పరీక్షల కుదింపు
700 మంది సిబ్బంది నియామకం
పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు


హనుమకొండ, మే 16 (ఆంధ్రజ్యోతి) :
కొవిడ్‌ నేపథ్యంలో రెండేళ్ల విరామం తర్వాత నిర్వహిస్తున్న పదో తరగతి పరీక్షలకు హనుమకొండ జిల్లా విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 23 నుంచి జూన్‌ 1 వరకు పరీక్షలు జరుగనున్నాయి. ఇది వరకు పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు పదకొండు పేపర్లు రాయాల్సి ఉండగా కరోనా కారణంగా ప్రత్యక్ష తరగతులు ఆలస్యంగా ప్రారంభం కావడంతో వాటి సంఖ్యను ఆరు పేపర్లకు కుదించారు.

కొవిడ్‌ నిబంధనల మేరకు పరీక్షా కేంద్రాల్లో విద్యార్థు లు కుర్చుండేలా అధికారులు సిట్టింగ్‌ ఏర్పాట్లు చేస్తున్నా రు. ఒక్కో బెంచీకి ఒక్కో విద్యార్ధి చొప్పున విద్యార్థులను జెడ్‌ ఆకారంలో కూర్చోబెట్టేలా చర్యలు తీసుకుంటున్నారు. ఒక్కో పరీక్ష కేంద్రంలోని తరగతికి 12 నుంచి 24 మంది విద్యార్థులు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. చిన్నగదులైతే 12 మంది, పెద్ద గదులైతే 24 మంది కూర్చొనేలా బెంచీలు వేస్తారు. ఎండలు తీవ్రంగా ఉండడంతో పరీక్షా కేంద్రాల వద్ద ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, తాగునీటి సదుపాయం కల్పిస్తున్నారు. ప్రతీ పరీక్ష కేంద్రంలో ఒక ఏఎన్‌ఎం, ఆశకార్యకర్త అందుబాటులో ఉంటారు. అనారోగ్య సమస్యలు ఉన్న వా రు పరీక్ష రాయడానికి ప్రతీ కేంద్రానికి ఒక ప్రత్యేక గదిని ఏర్పాటు చేయనున్నారు. పరీక్షల సమయానికి అనుగుణం గా బస్సులు నడిపేలా ఆర్టీసీ అధికారులతో చర్చించారు.

సీసీ కెమెరాల నిఘా
సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహించనున్నా రు. ప్రతీ పరీక్షా కేంద్రంలో ఒక సీసీ కెమెరా ఏర్పాటు చే యనున్నారు. చీఫ్‌ సూపరింటెండెంట్‌ గదిలో సీల్‌ చేసిన ప్రశ్నాపత్రాలను తెరుస్తారు. పరీక్షల చివరి రోజున సీసీటీ వీ పుటేజీని జిల్లా విద్యాశాఖ అధికారులకు అప్పగిస్తారు. ప్రైవేటు పాఠశాలల్లో యాజమాన్యాలు సొంతంగా కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కలెక్టర్‌ సూచన మేరకు ఏర్పాట్టు చేయనున్నారు.

12,507 మంది విద్యార్థులు
హనుమకొండ జిల్లాలో ఈ సారి పదో తరగతి పరీక్షలకు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలతో పాటు గురుకులా లు, ఎయిడెడ్‌, కస్తూర్బా, మోడల్‌ పాఠశాలలు కలిపి మొ త్తం 12,507 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. జి ల్లాల పునర్విభజనకు ముందు వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో విద్యార్థుల సంఖ్య 15, 600 వరకు ఉండేది. పునర్విభజన అనంతరం వరంగల్‌ అర్బన్‌ జిల్లా హనుమకొండ జిల్లాగా మారిన తర్వాత కొన్ని వరంగల్‌, ఖిలా వరంగల్‌ మండలా లు వరంగల్‌ జిల్లాలోకి వెళ్ళిన తర్వాత కొన్ని పాఠశాలలు ఆ జిల్లా పరిధిలోకి వెళ్ళడంతో విద్యార్థుల సంఖ్య 12,507కి తగ్గింది. పరీక్షల నిర్వహణకు 71 సెంటర్లను ఏర్పాటు చే శారు. కరోనా దృష్ట్యా విద్యార్థుల రద్దీని త గ్గించడానికి పరీక్షా కేంద్రాల సంఖ్యను గతంలో కన్నా ఈ సారి పెంచారు. రద్దీని నివారించేందుకు ప్రతీ కేంద్రంలో విద్యార్థులు 150 నుంచి 200 మంది మించకుండా చూస్తున్నారు.

విద్యార్థుల సన్నద్ధత
జనవరి 10 లోపే పూర్తికావాల్సిన సిలబస్‌ సంక్రాంతి సెలువులు, కరోనా థర్డ్‌ వేవ్‌తో కాస్త ఆలస్యం అయినా సిలబస్‌ పూర్తి చేశారు. వంద శాతం సిలబస్‌ పూర్తి చేసేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక తరగతులు తీసుకున్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై మరింత శ్రద్ధ పెట్టారు. విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేయడంతో పాటు ఉత్తమ ఫలితాలు సాధించే లక్ష్యంతో విద్యాశాఖ అన్ని చర్యలు తీసుకుంటోంది. ఉదయం, సాయంత్రం గంట వంతున ప్రత్యేక తరగతులు నిర్వహించారు. పరీక్షల ఒత్తిడిని దూరం చేసేందుకు విద్యార్థులకు ప్రీ ఫైనల్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

పరీక్షలు రాసే ముందు విద్యార్థులు ఎటువంటి మానసిక ఒత్తిడి, ఆందోళనకు గురికాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని, గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని విద్యాశాఖాధికారులు సూచిస్తున్నారు. పరీక్ష ఉదయం 9.30 గంటలకు ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 12.45 గంటలకు ముగుస్తుంది. పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు సకాలంలో చేరుకునేందుకు టీఎస్‌ ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు నడపనున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. పరీక్షా కేంద్రాలకు ఒక కిలోమీటర్‌ దూరం వరకు జీరాక్స్‌ సెంటర్లను మూసి ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

నాలుగు ప్లయింగ్‌ స్వ్కాడ్‌లు
పరీక్షలు సజావుగా, పకడ్బందీగా జరిగేందుకు వీలుగా పటిష్టమైన నిఘాను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా నాలుగు ప్లయింగ్‌ స్వ్కాడ్‌లను నియమించారు. ఒక్కో స్వ్కాడ్లలో ముగ్గురేసి ఉంటారు. వీరిలో ఒకరు విద్యాశాఖ, ఒకరు పోలీసు, మరొకరు రెవెన్యూ శాఖకు చెందిన అధికారులు ఉంటారు. పరీక్షల నిర్వహణకు చీఫ్‌ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంటల్‌ అధికారులు, ఇన్విజిలేటర్లు, కలుపుకొని మొత్తం 700 మందిని నియమించారు.

కరోనా నేపథ్యంగా...

కరోనా మహమ్మారి సాధారణ జనజీవనంతో పాటు విద్యార్థుల భవితవ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. రెండేళ్ళ పాటు తరగతులు నిర్వహించని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఫలితంగా విద్యార్థులు తరగతులకు హాజరకాకుండా, ఉపాధ్యాయుల బోధనలు జరగకుండా, పరీక్షలు జరగకుండా పైతరగతులకు చేరుకున్నారు. దీని వల్ల విద్యార్థులకు బోధన సామర్ధ్యాలు సైతం కా స్త పడిపోయాయి. ఈ నేపథ్యంలో 2019-20, 2020-21 విద్యా సంవత్సరాల్లో విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయకుండానే ప్రభుత్వం ఉత్తీర్ణత చేస్తున్నట్టు ప్రకటించింది. ఫలితంగా ఇంటర్‌కు సైతం పరీక్షలు లేకుండానే ప్రమోట్‌ చేశారు.


సర్వం సిద్ధం చేశాం..: కలెక్టర్‌
హనుమకొండ రూరల్‌, మే 16 : పదో తరగతి పరీక్షలకు పకడ్బందీ చర్యలు తీసుకొని సిద్ధంగా ఉన్నామని కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు తెలిపారు. సోమవా రం హైదరాబాద్‌ నుంచి స్కూల్‌ డైరెక్టర్‌ శ్రీదేవసేనతో కలిసి రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సందీ్‌పకుమార్‌ సుల్తానియా అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. మే 23 నుంచి జూన్‌ 1వరకు నిర్వహించే 10వ తరగతి పరీక్షలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. హనుమకొండ జి ల్లాలో 71 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపా రు.  విద్యార్థులు మొత్తం 12507 మంది, ప్రయివేట్‌గా తొమ్మిది మంది పరీక్షలు రాస్తున్నారని, పరీక్షల విధులకు 842 మంది సిబ్బందిని నియమించినట్లు వివరించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి, డీసీపీ అశోక్‌, డీఈవో రంగయ్య నాయుడు, డీఎంహెచ్‌వో బి.సాంబశివరావు, డీపీవో జగదీష్‌, ఆర్టీసీ, పోస్టల్‌, విద్యుత్‌ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2022-05-17T05:49:33+05:30 IST