వచ్చే వారానికి ఆక్స్‌ఫర్డ్‌ టీకా సిద్ధం?

ABN , First Publish Date - 2020-10-27T06:54:38+05:30 IST

కరోనా కట్టడికి ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ అభివృద్ధి చేసిన టీకా నవంబరు మొదటివారంలోనే యూకే ఆస్పత్రులకు అందుబాటులోకి

వచ్చే వారానికి ఆక్స్‌ఫర్డ్‌ టీకా సిద్ధం?

లండన్‌, అక్టోబరు 26: కరోనా కట్టడికి ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ అభివృద్ధి చేసిన టీకా నవంబరు మొదటివారంలోనే యూకే ఆస్పత్రులకు అందుబాటులోకి రానుందంటూ బ్రిటన్‌కు చెందిన ‘సన్‌’ పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది.

‘‘ఆక్స్‌ఫర్డ్‌, ఆస్ట్రాజెనెకా రూపొందిస్తున్న వ్యాక్సిన్‌ తొలి బ్యాచ్‌ ఔషధాలను నవంబరు 2 తర్వాత అందుకోవడానికి సిద్ధంగా ఉండాలని లండన్‌లోని ఒక ప్రముఖ ఆస్పత్రి ట్రస్టుకు సమాచారం అందింది’’ అని అందులో పేర్కొంది.  


Updated Date - 2020-10-27T06:54:38+05:30 IST