థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు సంసిద్ధం

ABN , First Publish Date - 2021-07-30T16:17:13+05:30 IST

కొవిడ్‌ థర్డ్‌ వేవ్‌ను..

థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు సంసిద్ధం

అందుబాటులో వెయ్యి ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు, 1,500 డీ టైప్‌ సిలిండర్లు 

జిల్లా ఆస్పత్రులు, పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలకు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు


విశాఖపట్నం(ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ థర్డ్‌ వేవ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అధి కార యంత్రాంగం సిద్ధమవుతోంది. ఒక పక్క ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో పడ కలను సిద్ధం చేయడంతో పాటు అవ సరమైన వైద్య సిబ్బంది భర్తీకి చర్యలు చేపడుతున్నారు. మరోపక్క కరోనా సెకం డ్‌ వేవ్‌లో తీవ్రంగా వేధించిన ఆక్సిజన్‌ సరపఫరా సమస్యను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధమవుతు న్నారు. ఇందుకోసం ఆక్సిజన్‌ సిలిండర్లు, ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లను భారీగా సిద్ధం చేస్తున్నారు. థర్డ్‌ వేవ్‌ సన్నద్ధతలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం, దాతల ద్వారా సుమారు వెయ్యి ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లను సిద్ధం చేశారు. వీటిలో 750 రాష్ట్ర ప్రభు త్వం సమకూర్చగా, మరో 250 వరకు కాన్సన్‌ట్రేటర్లను దాతలు ఇచ్చారు. వీటిని జిల్లాలోని ప్రతి సీహెచ్‌సీకి, జిల్లా, ఏరి యా ఆస్పత్రికి 20 చొప్పున పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


అలాగే 1,800 డీ టైపు ఆక్సిజన్‌ సిలిండర్లను ప్రభుత్వం జిల్లాకు అందిం చింది. దాతలు అందించిన మరో 500 సిలిండర్లు అందుబాటులో ఉన్నాయి. మొత్తంగా 2,300 ఆక్సిజన్‌ సిలిండర్లు అందుబాటులో ఉండడంతో వీటిని సీహెచ్‌సీ, పీహెచ్‌సీ, జిల్లా ఆస్పత్రులకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా ఆక్సిజన్‌ సిలిండర్లు, కాన్సన్‌ట్రేట ర్లను ఫిల్లింగ్‌ చేసే బాధ్యతను నగర పరిధిలోని గ్యాస్‌ ఫిల్లింగ్‌ కంపెనీలకు అధికారులు అప్పగించారు.


రానున్న రోజుల్లో మరిన్ని సిలిండర్లు, కాన్సన్‌ట్రేటర్లు వస్తాయని అధికారులు చెబుతున్నారు. వీటిని అవసరాలను బట్టి బోధనాస్పత్రులైన కేజీహెచ్‌, ఘోషా, విమ్స్‌, ఈఎన్‌టీ, మెంటల్‌, ప్రాంతీయ కంటి ఆస్పత్రులకు పంపిణీ చేయనున్నారు. వీటితోపాటు నగర పరిధిలో ఉన్న గీతం, ఎన్‌ఆర్‌ఐ, గాయత్రి మెడికల్‌ కాలేజీల పరిధిలోని ఆస్పత్రుల్లో అత్యవసరంగా ప్రెజర్‌ స్వింగ్‌ అడ్‌సోర్పసన్‌ (పీఎస్‌ఏ) ఆక్సిజన్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని అధికారులు ఆదేశించారు. అలాగే పీడియాట్రిక్‌ కేసుల కోసం ప్రత్యేకంగా నగర పరిధిలోని రెయిన్‌బో ఆస్పత్రితోపాటు మరో రెండు ఆస్పత్రులను సిద్ధంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వ మానసిక ఆస్పత్రిలోని వశిష్ట బ్లాక్‌లో వంద పడకలతో పీడియాట్రిక్‌ బెడ్స్‌తో వార్డులు ఏర్పాటు చేస్తున్నారు. చిన్నారులకు వ్యాక్సిన్‌ ఇవ్వడంతోపాటు వైరస్‌ బారినపడిన వారికి అవసరమైన వైద్య సేవలు అందించడంపై 200 మంది వైద్యులు, నర్సింగ్‌ సిబ్బందికి ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు. సుమారు పదివేల ఆక్సిజన్‌ మాస్క్‌లు అందుబాటులోకి వచ్చాయి. వీటిని పెదవాల్తేరులోని ఏపీఎంఎస్‌ఐడీసీ కార్యాలయ ప్రాంగ ణంలో ఉన్న సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్‌లో భద్రపరిచారు.

Updated Date - 2021-07-30T16:17:13+05:30 IST