బద్వేలుకు తరలించేందుకు ఈవీఎంలు సిద్ధం

ABN , First Publish Date - 2021-10-17T06:02:05+05:30 IST

బద్వేలు నియోజకవర్గం ఉప ఎన్నికకు సంబంధించి ర్యాండమైజేషన చేసిన ఈవీఎంలు, వీవీ ప్యాట్స్‌ బద్వేలులో ఉన్న గౌడౌనకు తలించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామని జిల్లా రెవెన్యూ అధికారి మలోల తెలిపారు.

బద్వేలుకు తరలించేందుకు ఈవీఎంలు సిద్ధం

జిల్లా రెవెన్యూ అధికారి మలోల

కడప (కలెక్టరేట్‌), అక్టోబరు 16 : బద్వేలు నియోజకవర్గం ఉప ఎన్నికకు సంబంధించి ర్యాండమైజేషన చేసిన ఈవీఎంలు, వీవీ ప్యాట్స్‌ బద్వేలులో ఉన్న గౌడౌనకు తలించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామని జిల్లా రెవెన్యూ అధికారి మలోల తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లోని ఈవీఎం గోడౌనలో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో డీఆర్వో మలోల పరిశీలించారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ బద్వేలు ఉప ఎన్నికకు సంబంధించి ఈనెల 13వ తేదీ కలెక్టర్‌, ఎన్నికల అధికారి వి.విజయరామరాజు, ఎన్నికల సాధారణ పరిశీలకులు భీష్మకుమార్‌ ఆధ్వర్యంలో బద్వేలు నియోజకవర్గానికి ర్యాండమైజేషన ద్వారా ఈవీఎం, వీవీ ప్యాట్స్‌ను కేటాయించారన్నారు. సోమవారం బద్వేలు గోడౌనకు ఈవీఎంలు, వీవీ ప్యాట్స్‌ను సురక్షితంగా చేర్చేందుకు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేశామన్నారు. కార్యక్రమంలో ఈవీఎంల నోడల్‌ అధికారి రోహిణి, కలెక్టర్‌ కార్యాలయ ఎన్నికల పర్యవేక్షకులు శివారెడ్డి, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-17T06:02:05+05:30 IST