ముడుపుల ముసుగులో ‘రియల్‌’ దందా

ABN , First Publish Date - 2021-06-13T06:45:22+05:30 IST

దాకు అధికారులు గేట్లు తెరిచారు. పట్టణ శివారు ప్రాంతాల్లో రోజురోజుకు వె లుస్తున్న అక్రమ లేఔట్లు వ్యాపారులకు కాసులుపారిస్తున్నాయి.

ముడుపుల ముసుగులో ‘రియల్‌’ దందా
పొగరూరు సమీపాన వేసిన లేఔట్‌

కాసులు కురిపిస్తున్న అక్రమ లేఔట్లు

ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి

మోసపోతున్న ప్లాట్ల కొనుగోలుదారులు


పామిడి, జూన 12 : ముడుపుల ముసుగులో రియల్‌ ఎస్టేట్‌ దందాకు అధికారులు గేట్లు తెరిచారు. పట్టణ శివారు ప్రాంతాల్లో రోజురోజుకు వె లుస్తున్న అక్రమ లేఔట్లు వ్యాపారులకు కాసులుపారిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా వెలసిన ప్లాట్ల కొనుగోలుదారులకు మాత్రం శాపంగా మారుతోంది. మరోవైపు ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండికొడుతూ... రి యల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు రూ.కోట్లకు పడగలెత్తుతున్నారు.


భూముల ధరలకు రెక్కలు

పామిడిలో ఖాళీ స్థలాలు కనిపిస్తే చాలు.. రాత్రికి రాత్రే అక్రమ లేఔట్లు వెలుస్తున్నాయి. దీంతో భూముల ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. వ్య వసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చకుండా రి యల్టర్లు దందా నడుపుతున్నారు. ఇలాంటి అక్రమ వెంచర్లు 44వ జాతీయ రహదారికి ఇరువైపులా ఇష్టారాజ్యంగా పుట్టుకొచ్చాయి. కొన్ని లేఔట్లకు అధికార పార్టీ నాయకుల అండదండలు ఉండడంతో అధికారులు ఆవైపు కన్నె త్తి చూడడం లేదన్న విమర్శలు లేకపోలేదు. మరికొన్ని లేఔట్ల ముసుగు అ ధికారుల చేతికి చిక్కింది. ముడుపులు ముడితే అనుమతులు అవసరం లే దన్నట్లు అధికారులు వ్యవహరిస్తున్నారు. దీంతో ప్రభుత్వానికి రూ.కోట్లల్లో ఆదాయం గండిపడుతోంది. అధికారుల నిర్లక్ష్యం కొనుగోలుదారుల పాలిట శాపంగా మారింది. వంక పోరంబోకు స్థలాలు ఆక్రమించి వెంచర్లలోకి కలిపేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. పట్టణంతో పాటు జాతీయ రహదారికి ఇరువైపులా వెలసిన వెంచర్లలో దాదాపు 90 శాతం అక్రమ లేఔట్లే ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ముడుపులు ఇవ్వని, నాయకుల అండ లేని లే ఔట్లపై అధికారులు డేగకన్ను వేసి చర్యలు తీసుకుంటున్నారన్న విమర్శలు లేకపోలేదు. 


రిజర్వు సైట్లేవీ? 

లేఔట్‌ వేసే భూమిని వ్యవసాయేతర భూమిగా కన్వర్షన ఫీజు చెల్లించి మార్చుకోవాలి. నిబంధనల ప్రకారం లేఔట్‌లోకి వెళ్లేందుకు 45 అడుగుల వెడల్పుతో ప్రధాన రహదారి, అంతర్గత రోడ్లు కనీసం 33 అడుగుల వెడల్పుతో వేయాలి. వెంచర్‌లో 10 శాతం స్థలాన్ని సామాజిక ప్రజా అవసరాలకు వదలాలి. అలాగే రోడ్లు, విద్యుత స్తంభాలు, మురుగునీటి కాలువలు, విద్యుత ట్రాన్సఫార్మర్ల ఏర్పాటుకు స్థలం చూపాలి. పట్టణంలో ఇవేవీ అమ లు కావడం లేదు. అయితే రియల్టర్లు మాత్రం సెంటు స్థలం కూడా దేనికి వదలడం లేదు. వీరి నుంచి ముడుపులు పుచ్చుకొని అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని బహిరంగంగా విమర్శలు వినిపిస్తున్నాయి. అప్రూవల్‌ లేని లేఔట్లలో ప్లాట్లు కొని ఇళ్లు కట్టుకొనేవారు ఇబ్బందులకు గు రికాకతప్పదని ఒకవైపు అధికారులు ప్రకటనలు చేసి చేతులు దులుపుకుంటున్నారు. 


వ్యవసాయేతర భూమిగా మార్పు కాని లేఔట్లు

వ్యవసాయ భూముల్లో ప్లాట్లు వేయాలంటే రెవెన్యూ అధికారుల వద్ద కన్వర్షన చేయించుకోవాలి. దీనికి లేఔట్‌ స్థలం విలువలో 3 శాతం పన్ను చెల్లించాలి. ఇవేవీ చెల్లించకుండానే లేఔట్లు వేసి ప్లాట్లు అమ్మేస్తున్నారు. కొ నుగోలుదారులు ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఆ స్థలాల్లో ఇళ్లు కట్టేస్తున్నారు. ఇలాంటి వాటిపై రెవెన్యూ అధికారులు భారీగా జరిమానాలు వి ధించవచ్చు. ఇదే జరిగితే రియల్లర్ల కన్న కొనుగోలుదారులే ఎక్కువగా నష్టపోతారని పలువురు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్లాట్లు కొనుగోలు చేసేటప్పుడు లే అవుట్‌ అప్రూవల్‌ ఉందా, లేదా? అని తెలుసుకోవడం చాలా ము ఖ్యమని అధికారులు తెలియజేస్తున్నారు. 


ప్రభుత్వ ఆదాయానికి ఎగనామం

పెరిగిన భూముల ధరలకు తగ్గట్టుగా ఫీజుల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం చేకూరడం లేదు. దీందో ప్రభుత్వానికి రూ.కోట్లలో ఆదాయం గం డి పడుతోంది. పామిడిలో ఎకరా భూమి రూ.1.20 కోట్లు పైమాటే ధర ప లుకుతోంది. పట్టణంలోని 44వ జాతీయ రహదారికి ఇరువైపులా, ఎద్దులప ల్లి రోడ్డు, కొండాపురం రోడ్డు సమీపాన వేసిన లేఔట్లకు పూర్తిస్థాయిలో దే నికీ అనుమతులు లేవని అధికారులే తెలియజేస్తున్నారు. చాలా లేఔట్లలో అధికారులు, ఉద్యోగులు, పలువురు వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం సాగిస్తున్నారు. దీంతో ఆ వెంచర్లపై ఎలాంటి చ ర్యలు తీసుకోలేని పరిస్థితి నెలకొందని బహిరంగంగా చర్చించుకుంటున్నారు. 


అక్రమ లేఔట్లకు అడ్డుకట్ట వేస్తాం:

అనుపమ, మున్సిపల్‌ కమిషనర్‌, పామిడి

మున్సిపాలిటీ పరిధిలో వేసిన అక్రమ లే అవుట్లపై తగిన చర్యలు తీసుకుని అరికడతాం. పట్టణంలో కేవలం 7 వెంచర్లకు మాత్రమే పూర్తిస్థాయిలో అనుమతులున్నాం. దాదాపు 50 సర్వేనంబర్లలో రిజిస్ట్రేషన్లను నిలుపుదల చేయాలని రిజిస్ర్టార్‌ కార్యాలయంకు నివేదిక అందజేశాము. ఇప్పటికే పలుమార్లు అక్రమ లే ఓట్లలో కొనుగోలు చేయరాదని సూచించాం. రియల్టర్లకు నోటీసులు జారీ చేస్తాం. నిబంధనల ప్రకారం ఉంటేనే అనుమతులు మంజూరు చేస్తాం.

Updated Date - 2021-06-13T06:45:22+05:30 IST