‘రియల్ దండుపాళ్యం’ వచ్చేస్తోంది

Published: Fri, 28 Jan 2022 16:22:04 ISTfb-iconwhatsapp-icontwitter-icon
రియల్ దండుపాళ్యం వచ్చేస్తోంది

రాగిణి  ద్వివేది, మేఘ‌న రాజ్ ప్రధాన పాత్రల్లో తెలుగు, క‌న్నడ భాష‌ల్లో రూపొందిన చిత్రం ‘రియ‌ల్ దండుపాళ్యం’. శ్రీ వైష్ణో దేవి ప‌తాకంపై,  సి.పుట్టస్వామి నిర్మించారు. మ‌హేష్ ద‌ర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఫిబ్రవ‌రి 4న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టియ‌ఫ్‌పిసి సెక్రట‌రి టి. ప్రసన్నకుమార్ మాట్లాడుతూ...`మ‌గాడి దాష్టీకానికి ఆడ‌వారు ఎలా బ‌ల‌వుతున్నారో దండు పాళ్యం గ‌త సిరీస్ లో చూపించారు. కానీ  ఈ రియ‌ల్ దండుపాళ్యంలో మ‌హిళ‌లు వారిపై జ‌రిగే అకృత్యాలు, అన్యాయాల‌పై తిర‌గ‌బ‌డితే ఎలా ఉంటుందో చూపించే ప్రయ‌త్నం చేసార‌ని ట్రైల‌ర్ చూస్తే అర్థమ‌వుతోంది. ఈ ట్రైల‌ర్ చూశాక ఒక క‌ర్తవ్యం, ప్రతిఘ‌ట‌న‌, మౌన‌పోరాటం చిత్రాలు గుర్తొచ్చాయి. ఈ సినిమా ప్రతి మ‌హిళ చూడాలి.  ఇన్ స్పైర్ అవ్వాలి. రాగిణి యాక్షన్ ఎపిసోడ్స్ అద్భుతంగా చేసింది. ఫిబ్రవ‌రి 4న వ‌స్తోన్న ఈ చిత్రం పెద్ద స‌క్సెస్ సాధించాల‌ని` అన్నారు. 


ఇక ఈ కార్యక్రమానికి విచ్చేసిన సురేష్ కొండేటి,  నిర్మాత సి.పుట్టస్వామి, రామా నాయక్,  న‌టి రాగిణి ద్వివేది, సంజీవ్ చౌహాన్, నిర్మాత తుమ్మల‌ప‌ల్లి రామ‌స‌త్యనారాయ‌ణ ఈ సినిమా విశేషాలు తెలిపి, చిత్ర బృందానికి విషెస్ తెలిపారు.  ఇంకా ఈ కార్యక్రమంలో మాన‌స‌. శ్యామ్ స‌న్, శేఖ‌ర్ నాయ‌క్‌, సందీప్ చౌహాన్ త‌దిత‌రులు పాల్గొన్నారు. మేఘన రాజ్, దీప్తి, ప్రధమ ప్రసాద్, సంయుక్త హర్నడ్, యువరాజ్, రఘు బట్ తదితరులు నటించిన ‘రియల్ దండుపాళ్యం’ ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International