వెంచర్లకు చెరువు మట్టి

ABN , First Publish Date - 2021-07-25T05:34:08+05:30 IST

నిన్న మొన్నటి వరకూ తమ స్థలాలను చదును చేసేందుకు కొండ, గుట్టలపై కన్నేసిన రియల్టర్లు ఇప్పుడు తమ దృష్టిని చెరువులు, గుంతలవైపు పెట్టారు. తాము వేసిన వెంచర్లకు సమీపంలో ఉన్న చెరువులలో ఇష్టానుసారంగా మట్టి తవ్వకాలను చేస్తున్నారు. అధికారపార్టీ నాయకుల అండో, అధికారుల చేతి వాటమో తెలియదుకానీ రియల్టర్ల అక్రమ తవ్వకాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది.

వెంచర్లకు చెరువు మట్టి
గుంతలమయమైన రాయవరం చెరువు

అక్రమంగా తరలిస్తున్న రియల్టర్లు

పట్టించుకోని అధికారులు

మార్కాపురం, జూలై 24 : నిన్న మొన్నటి వరకూ తమ స్థలాలను చదును చేసేందుకు కొండ, గుట్టలపై కన్నేసిన రియల్టర్లు ఇప్పుడు తమ దృష్టిని చెరువులు, గుంతలవైపు పెట్టారు. తాము వేసిన వెంచర్లకు సమీపంలో ఉన్న చెరువులలో ఇష్టానుసారంగా మట్టి తవ్వకాలను చేస్తున్నారు. అధికారపార్టీ నాయకుల అండో, అధికారుల చేతి వాటమో తెలియదుకానీ రియల్టర్ల అక్రమ తవ్వకాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది.  

రాయవరం చెరువులో అక్రమ తవ్వకాలు

మార్కాపురం మండలంలోని రాయవరంలో ఇటీవల మెడికల్‌ కళాశాలకు సీఎం శంకుస్థాపన చేయడంతో ఆ స్థలాలకు డిమాండ్‌ పెరిగింది. దీంతో రియల్టర్లు తమ వ్యాపార కార్యకలాపలను ఆ ప్రాంతంలో ముమ్మరం చేశారు. ఆయా వెంచర్లలో భూమిని చదును చేసేందుకు అవసరమైన మట్టి కోసం అక్రమ మార్గాలను అన్వేషిస్తున్నారు. దగ్గరలో ఉన్న రాయవరం చెరువు మట్టి అందుకు అనుకూలంగా ఉండటంతో దానిపై దృష్టి సారించారు. అనుకున్నదే తడువుగా తవ్వకాలు జరిపి మట్టిని తరలిస్తున్నారు.

పట్టించుకోని అధికారులు

రాయవరం గ్రామం జాతీయ రహదారి పక్కనే ఉంది. జాతీయ రహదారిపై నుంచి చెరువులో జరిగే అక్రమ తవ్వకాలు ప్రతి ఒక్కరికీ కనపడుతూనే ఉంటాయి. ఇంత జరుగుతున్నా అధికారులు  అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. అధికార పార్టీ నేతల అండదండలా? లేక అధికారుల చేతి వాటమో? తెలియదు కానీ  రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులెవరూ పట్టించుకోవడం లేదు.


Updated Date - 2021-07-25T05:34:08+05:30 IST